IND vs AUS T20 World Cup : తిప్పేసిన షమీ తలవంచిన ఆసిస్
6 పరుగుల తేడాతో భారత్ విక్టరీ
IND vs AUS T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ కొనసాగుతోంది. సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆసియా కప్ గెలిచిన శ్రీలంకకు కోలుకోలేని షాక్ ఇచ్చింది నమీబియా. ఇక స్కాట్లాండ్ చేతిలో వెస్టిండీస్ ఘన విజయాన్ని సాధించింది. ఈ తరుణంలో భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన పోరు అక్టోబర్ 23న జరగనుంది.
ఈ తరుణంలో మెగా టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. భారత్, ఆసిస్(IND vs AUS T20 World Cup) జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. గాయం కారణంగా తప్పుకున్న బుమ్రా స్థానంలో ఉన్నట్టుండి మహ్మద్ షమీ ఆసిస్ కు వెళ్లాడు. ఇంకేం మనోడి మ్యాజిక్ దెబ్బకు ఆసిస్ ఓటమి పాలైంది.
ఆఖరి ఓవర్ లో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేలా చేశాడు. థ్రిల్లింగ్ విక్టరీ భారత్ కు మంచి ఊపు ఇస్తుందనడంలో సందేహం లేదు. 20 ఓవర్లలో 180 పరుగులు మాత్రమే చేసింది. ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ తీవ్ర టెన్షన్ కు గురి చేసింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ మహ్మద్ షమీకి ఇచ్చాడు.
ఆఖరి ఓవర్ లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది ఆసిస్ కు. షమీ బౌలింగ్ లో మొదటి రెండు బంతులకు నాలుగు రన్స్ వచ్చాయి. ఇదే సమయంలో
మూడో బంతి నుంచి అద్భుతం చోటు చేసుకుంది. ఆసిస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మూడో బాల్ ను కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ పట్టేశాడు.
నాలుగో బంతికి అగర్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి జోష్ క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఆరో బంతికి రిచర్డ్ సన్ వికెట్లు కూల్చాడు. దీంతో హ్యాట్రిక్
సాధించాడు షమీ. కేఎల్ రాహుల్ , సూర్య కుమార్ యాదవ్ సత్తా చాటారు.
Also Read : పసికూన చేతిలో విండీస్ కు పరాభవం