U19 Womens World Cup 2023 : టీమిండియా విశ్వ విజేత
అండర్ 19 మహిళా టీ20 కప్ మనదే
U19 Womens World Cup 2023 : ఈ ఏడాది భారత క్రీడా రంగానికి శుభశూచకం. పురుషుల క్రికెట్ జట్టు విజయాల బాట పడితే మహిళా క్రికెటర్లు సైతం తాము పురుష క్రికెటర్లకు తీసి పోమంటూ సత్తా చాటుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించిన తొలి అండర్ 19 మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో(U19 Womens World Cup 2023) ఇంగ్లండ్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది భారత మహిళా జట్టు.
మొదటి నుంచీ పట్టుదలతో ఆడి షెఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు మన అమ్మాయిలు. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ప్రత్యర్థి జట్టును కేవలం 68 పరుగులకే కట్డడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ముప్పు తిప్పలు పెట్టింది.
అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 రన్స్ చేసింది. తొలి విశ్వ విజేతగా అవతరించింది. ఇక బ్యాటింగ్ లో మన తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష సత్తా చాటింది. 3 ఫోర్లతో 24 రన్స్ చేసి టాపర్ గా నిలిచింది.
అంతకు ముందు ఇంగ్లండ్ జటజ్టు 17.1 ఓవర్లలో తక్కువ పరుగులకే చాప చుట్టేసింది.సాధు, అర్చనా దేవి, చోప్రా చెరో 2 వికెట్లు తీశారు. కశ్యప్ , షెఫాలీ, సోనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్ పరంగా చూస్తే సౌమ్య 24, త్రిష 24, వర్మ 15 , శ్వేత 5 రన్స్ చేశారు. విశ్వ విజేతగా నిలిచిన అండర్ 19 భారత మహిళా జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : టీమిండియా గెలుపు చిరస్మరణీయం