IND vs ENG T20 World Cup : సత్తా చాటిన కోహ్లీ..హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్ ముందు 169 రన్స్ టార్గెట్
IND vs ENG T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా రెండో సెమీ ఫైనల్ లో భారత జట్టు ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్(IND vs ENG T20 World Cup) ఉంచింది. ఇప్పటికే గ్రూప్ -1 లో న్యూజిలాండ్ ను దాయాది పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్ కు చేరుకుంది.
దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టు ఫైనల్ లో పాక్ తో తలపడనుంది. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ ముందు 169 రన్స్ లక్ష్యం ఉంచింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవెల్ లో ఈ మ్యాచ్ కొనసాగుతోంది.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 5 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది. ఎప్పటి లాగే కీలక మ్యాచ్ లో కేఎల్ రాహుల్ నిరాశ పరిచాడు. ఇక స్టార్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) 14 రన్స్ కే వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు జట్టును ఒడ్డుకు చేర్చారు.
రోహిత్ శర్మ 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 50 హాఫ్ చెంచరీ చేస్తే హార్దిక్ పాండ్యా దుమ్ము రేపాడు. 64 రన్స్ తో సత్తా చాటాడు. ఇక దినేష్ కార్తీక్ కు బదులు రంగంలోకి దిగిన రిషబ్ పంత్ మళ్ళీ నిరాశ పరిచాడు. 6 పరుగులకే రనౌట్ అయి వెనుదిరిగాడు. అశ్విన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.
ఇక ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ నిలిచాడు.
Also Read : టి20 వరల్డ్ కప్ మాదే – బాబర్ ఆజమ్