IND vs NZ 2nd ODI : భార‌త్..కీవీస్ రెండో వ‌న్డే వ‌ర్షార్ఫ‌ణం

ర‌ద్దు చేసిన మ్యాచ్ అంపైర్లు

IND vs NZ 2nd ODI : న్యూజిలాండ్ వ‌న్డే సీరీస్ లో భాగంగా ఆదివారం హామిల్ట‌న్ లోని సెడాన్ పార్క్ వేదిక‌గా జ‌రిగిన టీమిండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగిన రెండో వ‌న్డే(IND vs NZ 2nd ODI)  మ్యాచ్ ర‌ద్ద‌యింది. ఎడ తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తుండ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అంపైర్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని టి20 సీరీస్ ను భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. ఇక మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా వెట‌ర‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు మొద‌టి వ‌న్డే మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 306 ప‌రుగులు చేసింది.

న్యూజిలాండ్ ఓపెన‌ర్ , కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ అద్భుతంగా ఆడారు. కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఇక వ‌న్డే సీరీస్ ను ప్ర‌భావితం చేసే రెండో వ‌న్డే మ్యాచ్ ను వ‌ర్షం అడ్డుగా నిలిచింది. దీంతో భారత జ‌ట్టుకు ఇబ్బందిగా మారింది. 4వ ఓవ‌ర్ జ‌ర‌గుతున్న‌ప్పుడు వ‌ర్షం ప‌డింది కొద్ది సేపు అంత‌రాయం క‌లిగింది.

ప‌రిస్థితిని చూసి అంపైర్లు మ్యాచ్ ను 29 ఓవ‌ర్లకు కుదించారు. ఇదిలా ఉండ‌గా మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ అవుట్ అయ్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన సూర్య కుమార్ యాద‌వ్ 34 ర‌న్స్ చేస్తే శుభ్ మ‌న్ గిల్ 45 ప‌రుగుల‌తో రాణించారు.

12.5 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ కోల్పోయి 89 మాత్ర‌మే చేయ‌గా అంత‌లో మ‌రోసారి భారీ వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్ ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. కాగా సంజూ శాంస‌న్ ను మ‌రోసారి ప‌క్క‌న పెట్టడం తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసేలా చేసింది.

Also Read : ర‌మీజ్ ర‌జా కామెంట్స్ డోంట్ కేర్

Leave A Reply

Your Email Id will not be published!