IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరు వర్షార్ఫణం
భారీ వర్షంతో మ్యాచ్ రద్దు
IND vs PAK Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకలో జరిగిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్(IND vs PAK Asia Cup 2023) వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇప్పటికే శ్రీలంక , పాకిస్తాన్ జట్లు తమ తొలి మ్యాచ్ లలో గెలుపొందాయి. పాకిస్తాన్ నేపాల్ ను భారీ తేడాతో ఓడించింది. లంక బంగ్లాదేశ్ టీమ్ ను మట్టి కరిపించింది.
IND vs PAK Asia Cup 2023 Match Canceled
దాయాదుల మధ్య పాకిస్తాన్ లో కాకుండా తటస్థ వేదికపై ఇరు జట్లు శ్రీలంక లోని క్యాండీ వేదికగా తలపడ్డాయి. భారీ ఎత్తున క్రికెట్ ప్రేమికులు చేరుకున్నారు. ముందస్తుగానే టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఏ మేరకు పోరు కొనసాగుతుందని ఉత్కంఠకు లోనయ్యారు.
లక్షలాది మంది టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోయారు. తీరా వర్షం ఇరు జట్లపై నీళ్లు చల్లింది. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు వర్షం కురిసింది. క్యూరేటర్స్ క్లీన్ చేశారు. దీంతో మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో మైదానంలోకి రావాల్సిన పాకిస్తాన్ జట్టు రాలేదు. భారీ వర్షం అతలాకుతలం చేసింది.
దీంతో మ్యాచ్ అంపైర్లు మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. చెరో పాయింట్ కేటాయించారు. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా టాప్ ఆర్డర్లు విఫలమయ్యారు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. చెరో హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు.
Also Read : TTD Board Members : టీటీడీ సభ్యులుగా ప్రమాణం