IND vs ZIM 1st ODI : ధావ‌న్ ధ‌నా ధ‌న్ గిల్ సెన్సేష‌న్

చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన జింబాబ్వే

IND vs ZIM 1st ODI : వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ రెచ్చి పోయాడు. షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా సెంచ‌రీతో రెచ్చి పోయాడు. దీంతో భార‌త జ‌ట్టు జింబాబ్వే టూర్(IND vs ZIM 1st ODI) లో మొద‌టి వ‌న్డే మ్యాచ్ ను ఏకంగా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని సాధించింది.

టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ ఓడి పోయి బ‌రిలోకి దిగిన జింబాబ్వే 189 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్లు దీప‌క్ చహ‌ర్ , ప్ర‌సిధ్ కృష్ణ స‌త్తా చాటారు.

అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నారు. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 40.3 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. కెప్టెన్ చ‌కాబ్వా ఒక్క‌డే టాప్ స్కోరర్ గా నిలిచాడు.

35 ప‌రుగులు చేశాడు. ఒకానొక ద‌శ‌లో 107 ర‌న్స్ కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన రిచ‌ర్డ్ న‌గ‌ర్వా 34 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకోగా బ్రాడ్ ఎవ‌న్స్ 33 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు.

కెప్టెన్ తో పాటు ఈ ఇద్ద‌రూ స‌త్తా చాట‌డంతో ఆ మాత్ర‌మైనా గౌరవ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది. అనంత‌రం 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భార‌త జ‌ట్టు ఒక్క వికెట్ న‌ష్ట పోకుండా 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

శిఖ‌ర్ ధావ‌న్ 113 బంతుల్లో 81 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిస్తే మ‌రో ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ 71 బంతుల్లో 82 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. ఇక ఏ కోశాన వికెట్ ను కోల్పోలేదు టీమిండియా. ఈ విజ‌యంతో భార‌త జ‌ట్టు 1-0 తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Also Read : దుబాయ్ క్యాపిట‌ల్స్ టీమ్ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!