Amit Shah : సైబ‌ర్ సురక్షిత దేశంగా భార‌త్ – అమిత్ షా

టెక్నాల‌జీ ద్వారా భార‌తీయులు బ‌లోపేతం

Amit Shah : సైబ‌ర్ సుర‌క్షిత దేశంగా భార‌త్ ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పిలుపునిచ్చారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.

సోమ‌వారం ఆయ‌న టెక్నాల‌జీ, ఇంట‌ర్నెట్ ద్వారా భార‌తీయుల‌ను బ‌లోపేతం చేయాల‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త గురించి మాట్లాడారు.

దేశం సైబ‌ర్ సెక్యూరిటీ విష‌యంలో నిర్దారించాల్సిన అవ‌స‌రాన్ని అమిత్ షా స్ప‌ష్టం చేశారు. అది లేకుండా దేశం అభివృద్ది చెందద‌న్న విషయాన్ని గుర్తించాల‌న్నారు.

సైబ‌ర్ , జాతీయ భ‌ద్ర‌త‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో అమిత్ చంద్ర షా(Amit Shah) ప్ర‌సంగించారు. సైబ‌ర్ సుర‌క్షిత దేశాన్ని నిర్మించు కోవ‌డం, తీర్చిదిద్ద‌డం మ‌నంద‌రిపై ఉంద‌న్నారు.

దాని ప్రాముఖ్య‌త ఏమిటో తెలుసు కోవాల‌ని సూచించారు కేంద్ర మంత్రి. సైబ‌ర్ సెక్యూరిటీని నిర్దారించ‌క పోతే అది పెను స‌వాల్ గా మారుతుంద‌ని హెచ్చ‌రించారు.

దీనిపై మ‌రింత అవ‌గాహ‌న కలిగి ఉండాల‌న్నారు. ఆన్ లైన్ స్పేస్ ను ర‌క్షించేందుకు సాంకేతిక నిపుణుల ప్ర‌య‌త్నాల గురించి అమిత్ షా ప్ర‌స్తావించారు.

పౌరులు స్వ‌త‌హాగా సాంకేతికంగా విద్యావంతులు. కానీ అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌క పోతే ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నాల వ‌ల్ల డిజిట‌ల్ ఇండియా ప్ర‌చారం పౌరుల‌కు సాధికార‌త క‌ల్పించింద‌ని చెప్పారు.

ఇది సానుకూల మార్పున‌కు దారి తీసింద‌న్నారు అమిత్ షా(Amit Shah). ఇందులో భాగంగా దేశంలో వారోత్స‌వాలు కూడా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు.

2018లో ఏర్పాటైన ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఉత్స‌వాలు చేప‌ట్టామ‌న్నారు.

Also Read : ఢిల్లీలో కాంగ్రెస్ నిర‌స‌న రైళ్ల నిలిపివేత‌

Leave A Reply

Your Email Id will not be published!