PM Narendra Modi : బలమైన దేశంగా భారత్ – మోదీ
జర్మనీలో ప్రధానమంత్రి ప్రకటన
PM Narendra Modi : ప్రపంచంలో భారత దేశం బలమైన దేశంగా రూపుదిద్దు కుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) . జర్మనీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
జి7 దేశాల సదస్సులో కూడా పాల్గొంటారు. గతంలో పాలకులు అభివృద్ధి గురించి పట్టించు కోలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక భారత దేశాన్ని డిజటల్ మయంగా మార్చేశామన్నారు.
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే బారత్ మాత్రం సగర్వంగా ఎదుర్కొని నిలిచిందని చెప్పారు. అనేక విజయాలను సాధించిందని అన్నారు మోదీ.
ఇవన్ని తక్కువ వ్యవధిలోనే చేరుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. భారత దేశం ఏ సవాల్ నైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
టెక్నాలజీ పరంగా ఇవాళ భారత్ ను కాదని ఏ దేశం వెళ్ల లేదన్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ కంపనీలలో అత్యధికంగా భారత్ కు చెందిన ఐటీ నిపుణులు, దిగ్గజాలే ఉన్నారని చెప్పారు.
పురోగతి, అభివృద్ది ధ్యేయంగా తాము ముందుకు వెళుతున్నామని, ప్రభుత్వ సంకల్పానికి ప్రవాస భారతీయులు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ(PM Narendra Modi) .
మీ అభిమానం చూస్తుంటే తనకు ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. కోట్ల మంది భారతీయులు కలిసి పెద్ద లక్ష్యాలను సాధించిన తీరు అపూర్వమన్నారు.
దేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా ఉందన్నారు ప్రధాని. అవినీతి రహిత దేశంగా మార్చడమే తమ ముందున్న ప్రధాన టార్గెట్ అని స్పష్టం చేశారు.
Also Read : యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది -మోదీ