S Jai Shankar : వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ గా భారత్
స్పష్టం చేసిన సుబ్రమణ్యం జై శంకర్
S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ప్రస్తుతం కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. జనవరి 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి. గ్లోబల్ సౌత్ అనేది ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లోని అభివృద్ది చెందుతున్న దేశాలను సూచిస్తుందన్నారు.
భారత్ లో నిర్వహించే ఈ సమ్మిట్ కు ప్రపంచంలోని 120 దేశాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు ఎస్ జై శంకర్(S Jai Shankar). అభివృద్ది చెందుతున్న దేశాలు ప్రపంచం లోని ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థపై చాలా ఆశలు పెట్టుకున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఎంతో ఆశతో న్యూఢిల్లీ వైపు పలు దేశాలు చూస్తున్నాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం అన్ని దేశాలను ఏకతాటి పైకి తీసుకు రావడానికి భారత్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. వివిధ ప్రపంచ సవాళ్లకు సంబంధించిన వారి ఉమ్మడి ఆందోళనలు, ఆసక్తులు, దృక్కోణాలను పంచుకునేందుకు వర్చువల్ సమ్మిట్ ను భారత్ దేశం నిర్వహిస్తోందని చెప్పారు సుబ్రమణ్యం జై శంకర్.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన స్వామి మహారాజ్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి(S Jai Shankar). ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం లోని ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ పై అభివృద్ది చెందుతున్న దేశాలు చాలా ఆశలు పెట్టుకున్నాయని చెప్పారు.
Also Read : యూనిటెక్, మాజీ డైరెక్టర్ల పై మరో కేసు