Owaisi : ఈ దేశం ప్రజలది మోదీ..అమిత్ షాది కాదు
అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్
Owaisi : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.
మరో వైపు శివసేన జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ పై కూడా మండిపడ్డారు. ఈ దేశం మోదీ, షా, ఠాక్రేలది కాదన్నారు. భారత దేశం అంటే ద్రావిడులు, ఆదివాసీలదని అన్నారు.
ఈసారి ఓవైసీ సంజయ్ రౌత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ప్రధానిని ఎందుకు కలవలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను నిలదీశారు.
పైకి విమర్శలు చేస్తూ లోలోపట మీరంతా ఒక్కరే అంటూ ఫైర్ అయ్యారు ఓవైసీ. మొఘలుల తర్వాతే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర లోని భివాండిలో జరిగిన భారీ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సమున్నత భారత దేశం తమ స్వంత ఆస్తిగా, జాగీరుగా మోదీ, అమిత్ షా భావిస్తున్నారని ఈ దేశం ద్రావిడులు, ఆదివాసీలతో పాటు 135 కోట్ల భారతీయులదని గుర్తుంచు కోవాలన్నారు.
భారత దేశం ఏర్పడ్డాక ప్రజలు ఆఫ్రికా, ఇరాన్ , మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుండి వలస వచ్చారని చెప్పారు ఓవైసీ(Owaisi). నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పై నిప్పులు చెరిగారు.
సంజయ్ రౌత్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవార్, రౌత్ ఇద్దరూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ , ఎస్పీ లౌకిక పార్టీలు. వాళ్లు జైలుకు వెళ్ల కూడదని అనుకుంటారని కామెంట్ చేశారు. ముస్లిం అయిన నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఎందుకు ప్రధానిని ప్రశ్నించలేదన్నారు.
Also Read : మోదీ నోట్ల రద్దుపై టీఎంసీ ఫైర్