Mahmood Madani : ప్రముఖ మత సంస్థ జమియత్ ఉలమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఈ దేశం ఎంత ముఖ్యమో తమకు కూడా అంతే ప్రధానమని స్పష్టం చేశారు.
మతం పేరుతో బలవంతపు మత మార్పిడులకు తాము పూర్తిగా వ్యతిరేకమని కుండ బద్దలు కొట్టారు. అయితే స్వచ్చంధంగా మతం మార్చుకుంటున్న వాళ్లను అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడం మంచి పద్దతి కాదన్నారు. చాలా మందిని జైళ్లలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మౌలానా మహమూద్ మదానీ.
ఈ దేశంలో పుట్టిన వారంతా ఈ దేశానికి చెందిన వారే అవుతారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇండియా మోదీకి, భగవత్ కు ఎంత చెందుతుందో మదానీ(Mahmood Madani) అయిన తనకు అంతే చెందుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లో లోని రాం లీలా మైదానంలో జమియత్ ఉలమా ఇ హింద్ ప్రారంభ ప్లీనరీ సమావేశంలో మహమూద్ మదానీ ప్రసంగించారు.
ఈ దేశంలో ఇస్లాం పురాతన మతం. ఈ భూమి ముస్లింల మొదటి మాతృభూమి. ఇస్లాం అనేది బయటి నుండి వచ్చిన మతం అని చెప్పడం పూర్తిగా తప్పు అని అన్నారు మదానీ. ఇది పూర్తిగా నిరాధారం. ఇస్లాం మతం అన్ని మతాలలో కంటే పురాతన మతం అని చెప్పారు మత పెద్ద. హిందూ ముస్లింలకు అత్యుత్తమమైన దేశం ఇది.
Also Read : మోదీ పాలనలో స్వేచ్చకు మంగళం