India Blocks : 8 యూట్యూబ్ న్యూస్ ఛానళ్లపై నిషేధం
ప్రకటించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం
India Blocks : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారత దేశం పట్ల వ్యతిరేక ప్రచారాన్ని, విద్వేషాలను రెచ్చ గొడుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై(India Blocks) వేటు వేసింది.
ఏకంగా 114 కోట్ల వ్యూయర్ షిప్ కలిగి ఉన్న 8 యూట్యూట్ న్యూస్ చానెళ్లను నిషేధించింది. ఈ మేరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ
2021 రూల్స్ ప్రకారం 7 భారతీయ , ఒకటి పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఈ మొత్తం ఛానళ్లు అత్యంత జనాదరణ కలిగి ఉండడం విశేషం.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రధానంగా ఇండియాను టార్గెట్ చేయడాన్ని గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. అందుకే వాటిపై నిషేధించడం జరిగిందని పేర్కొంది.
నిరోధిత ఛానెల్ ల ద్వారా నకిలీ భారత దేశ వ్యతిరేక కంటెంట్ డబ్బు ఆర్జించ బడుతోందని వెల్లడించింది సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ.
ఈ వార్తా చానళ్లు భారత దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఆరోపించింది.
ఇప్పటికే కేంద్రం పలు యూట్యూబ్ ఛానళ్లను నిషేధం విధించింది. మోదీ ప్రభుత్వం ప్రత్యేకించి విద్వేషాలను రెచ్చగొట్టేలా దేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేశాయని పేర్కొంది కేంద్రం.
ఇదిలా ఉండగా అంతే కాకుండా వీటిపై నియంత్రించేందుకు గాను ఇటీవలే కేంద్రం కీలక మార్పులు చేసింది. ఏ మాత్రం అనుమానం వచ్చినా లేదా రూల్స్ పాటించక పోతే నిషేధం, శిక్ష పడనుంది.
Also Read : టెలికాం కంపెనీలకు కేంద్రం ఖుష్ కబర్
