India Creates : గిన్నిస్ రికార్డు సృష్టించిన త్రివ‌ర్ణ ప‌తాకం

పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా

India Creates : బీహార్ లోని బోజ్ పూర్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఏక కాలంలో ఏకంగా 78 వేల 220 మంది భార‌త దేశానికి చెందిన త్రివ‌ర్ణ (జాతీయ‌) ప‌తాకాన్ని ఎగుర వేశారు. ఇలా ఎగుర వేయ‌డం దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు.

ఐదు నిమిషాల పాటు ఈ ప‌తాకం రెప‌రెప‌లు కొన‌సాగ‌డం చ‌రిత్ర‌లో అరుదైన మైలురాయిగా మిగిలింది. దీంతో త్రివ‌ర్ణ ప‌తాకం (India Creates)ఎగుర‌వేత గిన్నిస్ రికార్డులో చోటు ద‌క్కించుకుంది.

జాతీయ గీతం వందేమాత‌రం బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండ‌గా 5 నిమిషాల పాటు ఏక కాలంలో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఊపారు. కేంద్ర మంత్రులు ఆర్ కే సింగ్, నిత్యానంద రాయ్ , ఉప ముఖ్య‌మంత్రులు తార్కిషోర్ ప్ర‌సాద్ తో స‌హా బీహార్ కు చెందిన అగ్ర నాయ‌కుడు కేంద్ర మంత్రి అమిత్ షాతో క‌లిసి వ‌చ్చారు.

హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో ఒకే స‌మ‌యంలో జాతీయ జెండాను రెప‌రెప‌లాడేలా చేశారు. దీంతో భార‌త దేశం చ‌రిత్ర సృష్టించింది.

ఈ విష‌యాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా భోజ్ పూర్ లో 75 ఏళ్ల స్వాతంత్ర వేడుక‌లో భారీ ఎత్తున భార‌త ప‌తాకాన్ని ఎగుర వేశారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ లో భాగంగా దీనిని చేప‌ట్టారు. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ స‌ర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని రికార్డుల‌ను బోజ్ పూర్ వాసులు బ‌ద్ద‌లు కొట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాని మోదీ.

Also Read : గ‌వ‌ర్న‌ర్ ర‌విపై సీఎం స్టాలిన్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!