India Military : సైనిక వ్య‌యంలో టాప్ 3లో ఇండియా

ఫ‌స్ట్ అమెరికా సెకండ్ చైనా

India Military :శాంతి భ‌ద్ర‌తల‌కు సంబంధించి సైనిక వ్య‌యం కోసం ఖ‌ర్చు పెడుతున్న దేశాల‌లో టాప్ 3 లో ఇండియా మూడో స్థానంలో(India Military) నిలిచింది. ఫ‌స్ట్ ప్లేస్ లో అమెరికా, రెండో స్థానంలో చైనా.

2021 సంవ‌త్స‌రం వ‌ర‌కు చూస్తే ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఆర్మీ కోసం ఖ‌ర్చు చేయ‌డం విశేషం. దేశ బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా వీటికే ఖ‌ర్చు చేస్తుంది.

అతి పెద్ద మిల‌ట‌రీ ఖ‌ర్చులో యుఎస్, చైనా, ఇండియా, యుకె , ర‌ష్యా నిలిచాయి. ఈ దేశాల‌న్నీ క‌లిసి 62 శాతం ఖ‌ర్చు చేశాయి. ప్ర‌పంచ సైనిక ఖ‌ర్చు $2 ట్రిలియ‌న్లు దాటింది.

విచిత్రం ఏమిటంటే మూడు దేశాల‌లో భార‌త దేశం ఉండ‌డం విశేషం. ఇందులో భాగంగా ఇండియా సైనిక వ్య‌యం 76.6 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేస్తోంది.

దీంతో వ‌ర‌ల్డ్ లోనే మూడో అత్య‌ధికంగా దేశంగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌పంచ సైనిక వ్య‌యం 2021లో ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయి యుఎస్ డీ 2.1 ట్ర‌లియ‌న్ ల‌కు చేరుకుంద‌ని స్టాక్ హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సోమ‌వారం వెల్ల‌డించింది.

యుఎస్ , చైనా, ఇండియా అత్య‌ధికంగా ఖ‌ర్చు చేయ‌డం విశేషం. మొత్తం ప్రపంచ సైనిక వ్య‌యం 0.7 శాతం పెరిగి యుఎస్ 2113 బిలియ‌న్ల‌కు చేరుకుంది.

ఈ విష‌యాన్ని స్టాక్ హోమ్ ఆధారిత ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సైనిక వ్య‌యం, ఆయుధాల ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మం ద్వారా సీనియ‌ర్ ప‌రిశోధ‌కుడు డాక్ట‌ర్ డియోగో లో పెస్ డా సిల్వా పేర్కొన్నారు. సైనిక వ్య‌యం 6.1 శాతం పెరిగింద‌ని వెల్ల‌డించింది.

Also Read : ఢిల్లీలో ‘హిందూ, ముస్లిం’ల తిరంగా యాత్ర‌

Leave A Reply

Your Email Id will not be published!