PM Modi : పెట్టుబడులకు భారత్ గమ్యస్థానం – మోదీ
ఏరో ఇండియా 2023లో ప్రధానమంత్రి
PM Modi : పెట్టుబడులకు భారత దేశం గమ్యస్థానంగా మారి పోయిందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. గత తొమ్మిది సంవత్సరాలలో రక్షణ ఉత్పత్తి రంగాన్ని పునరుద్దరించిందని చెప్పారు. సోమవారం బెంగళూరు వేదికగా భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆసియాలోనే అతి పెద్ద ఏరో ఇండియా 2023ని నిర్వహించింది.
దీనిని అధికారికంగా ప్రధాని మోదీ(PM Modi) జెండా ఊపి ప్రారంభించారు. గగన తలంలో వైమానిక దళ విన్యాసాలు కనులు విందు చేశాయి. ప్రపంచంలోని 98 దేశాలకు చెందిన వైమానిక దళాలు ఇక్కడ ప్రదర్శన చేపట్టనున్నాయి. ఇందులో అమెరికా కూడా ఉండడం విశేషం. ఎందుకంటే ప్రస్తుతం భారత్ జీ20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది.
ఈ సందర్భంగా నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రసంగించారు. దశాబ్దాలుగా అతి పెద్ద రక్షణ దిగుమతిదారుగా ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఇది ఒక రకంగా తమ ప్రభుత్వం సాధించిన అరుగైన ఘనత అని పేర్కొన్నారు.
ఇదంతా తమ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. గత ఐదు సంవత్సరాలలో బారత దేశ రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. అనుకూలమైన ఆర్థిక విధానాల మద్దతుతో ప్రపంచ వ్యాప్తంగా సైనిక రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసే అగ్రగామి దేశంగా ఎదుగుతోందన్నారు ప్రధానమంత్రి.
21వ శతాబ్దపు కొత్త భారత దేశం ఏ అవకాశాన్ని కోల్పోదన్నారు. ఎటువంటి ప్రయత్నాలకు లోటు ఉండదన్నారు. సంస్కరణల మార్గంలో ప్రతి రంగంలో విప్లవాన్ని తీసుకు వస్తామని చెప్పారు మోదీ(PM Modi).
Also Read : సీజేలుగా ప్రమాణ స్వీకారం