S Jai Shankar : శ్రీ‌లంక ఆర్థిక పురోగ‌తికి భార‌త్ భ‌రోసా

హామీ ఇచ్చిన విదేశాంగ శాఖ మంత్రి

S Jai Shankar : తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి మెల మెల్ల‌గా కోలుకుంటున్న శ్రీ‌లంక దేశానికి పూర్తి భ‌రోసా క‌ల్పించింది భార‌త‌దేశం. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) శ్రీ‌లంక‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికింది అక్క‌డి ప్ర‌భుత్వం. శ్రీ‌లంక అగ్ర నాయ‌క‌త్వం జై శంక‌ర్ తో కీల‌క భేటీ అయ్యింది.

శ్రీలంక ఆర్థిక పున‌రుద్ద‌ర‌ణ కోసం త‌మ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ హామీ ఇచ్చారు. శ్రీ‌లంక‌కు బెయిల్ అవుట్ అందించేందుకు రుణ దాత‌ల నుండి ప్ర‌పంచ రుణదాత కోరుకుంటున్న హామీని భార‌త‌దేశం ఇంట‌ర్నేష‌న‌ల్ మోనిట‌రింగ్ ఫండ్ కు తెలియ చేసింది.

ఇదిలా ఉండ‌గా పూర్తి హామీ ఇవ్వ‌డంపై కేంద్ర మంత్రికి శ్రీ‌లంక ప్ర‌భుత్వం ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఇదే స‌మ‌యంలో సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కొలంబోలో ఆ దేశ మంత్రి అలీ స‌బ్రీతో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయిన ద్వీప దేశం ఆర్థిక పున‌రుద్ద‌ర‌ణ‌ను మ‌రింత వేగ‌వంతం చేసేందుకు పెట్టుబ‌డుల‌ను పెంచేందుకు భార‌త్ పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచ రుణ దాత‌లను కూడా విన్న‌వించింది. శ్రీలంక‌కు ఆర్థిక సాయం చేయాల‌ని విన్న‌వించింది. జై శంక‌ర్(S Jai Shankar) ఇచ్చిన హామీ త‌మ‌ను గ‌ట్టెక్కించేలా చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు ర‌ణిల్ విక్ర‌మ సింఘే.

గ‌త ఏడాది కింద‌ట శ్రీ‌లంక సంక్షోభం ప్రారంభ‌మైన‌ప్పుడు భార‌త దేశం 4 బిలియ‌న్ డాల‌ర్ల సాయం చేసింది.

Also Read : మోడీ డాక్యుమెంట‌రీపై కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!