India MP’s Protest : మణిపూర్ హింసపై ఎంపీల నిరసన
వర్షంలో సైతం గాంధీ విగ్రహం ముందు
India MP’s Protest : మణిపూర్ లో చోటు చేసుకున్న హింస, అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ ప్రతిపక్షాల కూటమి ఇండియా ఆధ్వర్యంలో ఎంపీలు నిరసన(India MPS Protest) చేపట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ప్రాంగణలో కొలువు తీరిన మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
India MP’s Protest Continue
ప్రధానంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఎంపీ సంజయ్ సింగ్ పై రాజ్యసభ చైర్మన్ వేటు వేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. తోటి ఎంపీలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని , ఒక రకంగా దేశం చీకట్లలో కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ అల్లర్లతో అట్టుడికి పోతోందని అయినా కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. పూర్తిగా మణిపూర్ హింసకు నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు ఎంపీలు. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, జాతుల పేరుతో , విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు ఎంపీ సంజయ్ సింగ్.
Also Read : K Annamalai : గవర్నర్ రవికి అన్నామలై ఫిర్యాదు