India Achieves Record : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎన్ హెచ్ 53
75 కి.మీ. మేర కాంక్రీటు రోడ్డు నిర్మాణం
India Achieves Record : భారత దేశం అరుదైన ఘనతను సాధించింది. అతి పొడవైన రోడ్డు నిర్మాణంలో రికార్డు సృష్టించింది. ఈ ఘనతను సాధించిన విషయాన్ని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
53వ జాతీయ రహదారిలో పీస్ ఆఫ్ రోడ్డును నిర్మించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది భారత్. ఈ నేషనల్ హైవేపై 75 కిలో మీటర్ల పాటు బిటుమినస్ కాంక్రీట్ తో నిర్మించింది.
భారత దేశం వరల్డ్ రికార్డ్స్(India Achieves Record) లో చేరిందంటూ నితిన్ గడ్కరీ ప్రకటించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ ) కన్సల్టెంట్లు, రాయితీ దారు రాజ్ పత్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ , జగదీష్ కదమ్ కలిసి జాతీయ రహదారి 53లో ఒకే లేన్ లో 75 కిలోమీటర్ల నిరంతరం బిటు మినస్ కాంక్రీట్ ను నిర్మించి చరిత్ర సృష్టించారు.
ఒక సెక్షన్ లో రోడ్డు వేశారు. కాగా ఈ రోడ్డు మహారాష్ట్ర లోని అమరావతి, అకోలా జిల్లాల మధ్య విస్తరించి ఉంది 53వ జాతీయ రహదారి నెలకొంది.
ఈ సందర్భంగా అరుదైన ఘనత సాధించినందుకు మంత్రి నితిన్ గడ్కరీ మొత్తం టీంకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం దేశానికి గర్వకారణం. నిరంతరం బిటుమినస్ లు వేయడంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్(India Achieves Record) ను సాధించినందుకు అభినందనలు.
ఈ అసాధారణ ఫీట్ సాధించేందుకు పగలు రాత్రి కష్టపడి పని చేసిన ఇంజనీర్లు, కార్మికులకు తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు నితిన్ గడ్కరీ.
Also Read : ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరిక