Kaushik Basu : ఆర్థిక సంక్షోభం అంచున భారత్
విద్వేష రాజకీయాలు ప్రమాదకరం
Kaushik Basu : ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థిక వేత్త కౌశిక్ బసు భారత దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని, నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతోందని వాపోయారు.
మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు పెను సంక్షోభానికి దారి తీసేలా ఉన్నాయంటూ కౌశిక్ బసు హెచ్చరించారు. విభజించు పాలించు అనే పాలసీని ప్రధానంగా ముందుకు తీసుకు వస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
సమాజంలో విభజన తీసుకు వచ్చేలా రాజకీయాలు చేయడం మాను కోవాలని సూచించారు. కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం, టార్గెట్ చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని, తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఆర్థిక వేత్త కౌశిక్ బసు(Kaushik Basu) నిరుద్యోగిత విషయంలో మోదీ చర్యలు తీసుకోవడం లేదంటూ వాపోయారు. ఇక ఇప్పటికే నిరుద్యోగిత విషయంలో భారత దేశం ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేశారు.
ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో లేనంతగా నిరుద్యోగిత రేటు 24 శాతానికి పెరిగిందని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం పెరిగితే తగ్గించు కునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని కానీ విద్వేష రాజకీయాలను అదుపులో ఉంచడం చాలా కష్టమన్నారు కౌశిక్ బసు(Kaushik Basu).
రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందన్నారు కౌశిక్ బసు. భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నా సమాజ విభజన దాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : వారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి