India Post Jobs 2023 : పోస్టాఫీసులో భారీగా కొలువులు
ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు పండగే
India Post Jobs 2023 : ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు తీపివార్త చెప్పింది ఇండియా పోస్ట్(India Post). ఈ మేరకు ఏకంగా 12,828 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ప్రత్యేకంగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి పరీక్షలు అంటూ ఉండవు. పైరవీలకు కూడా ఆస్కారం ఉండదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా కొలువులను భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్(India Post).
ఇక పోస్టుల విషయానికి వస్తే ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ శాఖల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. మే 2023కు గాను వీటిని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్.
జాబ్స్ కు సంబంధించి 10వ తరగతిలో మ్యాథ్స్ , ఇంగ్లీష్ , స్థానికంగా తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. వీటితో పాటు ప్రత్యేకించి సైకిల్ తొక్కడం వచ్చి ఉంటే బెటర్. ఇక దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులు జూన్ 11, 2023 వరకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఇక రిజర్వేషన్ల వారీగా ఎస్సీలు, ఎస్టీలకు 5 ఏళ్లు , ఓబీసీలకూ మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 11 లోపు గడువు విధించింది.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. బీపీఎంలకు రూ. 12 వేల నుంచి రూ. 29, 380 వరకు ఇస్తారు. ఇక ఏబీపీఎం కు రూ. 10 వేల నుంచి రూ. 24,470 వరకు వేతనం ఇస్తారు.
Also Read : Lalan Singh