India Post National Flag : జాతీయ జెండాలు ఉచితంగా డెలివ‌రీ

ప్ర‌క‌టించిన భార‌తీయ పోస్టాఫీస్

India Post National Flag : భార‌త దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదికా అమృత్  అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

133 కోట్ల భార‌తీయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ప్ర‌తి ఇంటిపై త్రివ‌ర్ణ ప‌తాకం ఎగర వేయాల‌ని పిలుపునిచ్చింది. ఇప్ప‌టికే దేశంలోని అన్ని రాష్ట్రాలు వ‌జ్రోత్స‌వాల సంబురాలు చేప‌ట్టాయి.

హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరుతో ఇంటింటా జాతీయ జెండా ఎగ‌ర వేయ‌నున్నారు ఇందుకు సంబంధించి దేశంలోని ప్ర‌తి ప‌ల్లెలో విస్త‌రించి ఉన్న భార‌తీయ పోస్టాఫీసులలో జాతీయ ప‌తాకాలు కొనుగోలు చేస్తే ఎలాంటి జీఎస్టీ కానీ లేదా బ‌ట్వాడా చేసేందుకు చార్జీలు వ‌సూలు చేయ‌బోమంటూ ప్ర‌క‌టించింది.

ఎవ‌రైనా ఎక్క‌డి నుంచైనా ఏ ప్రాంతానికైనా త‌మ జాతీయ ప‌తాకాన్ని కొనుగోలు చేస్తే ఫ్రీగా డెలివ‌రీ చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఆన్ లైన్ ఎలా కొనుగోలు చేయాలో కూడా తెలిపింది.

తిరంగ విక్ర‌యాలు , పంపిణీని సుల‌భ‌త‌రం చేసేందుకు గాను చ‌ర్య‌లు తీసుకుంది. స్వాతంత్ర దినోత్స‌వానికి ముందు వ‌చ్చే సెల‌వు దినాల‌లో కూడా అన్ని పోస్టాఫీసులు ప‌ని చేస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇండియ‌న్ పోస్ట‌ల్ స‌ర్వీస్ భార‌తీయ జెండాను ఉచితంగా(India Post National Flag) ఇంటి వ‌ద్ద‌కు చేరుస్తుంది. త్రివ‌ర్ణ జెండాను రూ. 25 ధ‌ర‌తో ఇండియా పోస్ట్ పోర్ట‌ల్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇది 20 x 30 అంగుళాల ప‌రిమాణంలో ఉంటుంది. జెండాను కొనేందుకు ఆస‌క్తి ఉన్న వారు ఈపోస్టాఫీస్ పోర్ట‌ల్ నుండి ఆర్డ‌ర్ చేయొచ్చు.

ప్ర‌త్యామ్నాయంగా వారు జాతీయ జెండాను కొనుగోలు చేసేందుకు స‌మీపంలోని పోస్టాఫీసుల‌లో కూడా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపింది.

Also Read : వ‌జ్రోత్స‌వాల వేళ ‘ప‌త‌కాలు’ క‌ళ క‌ళ‌

2 Comments
  1. Regula Mallesham says

    India national flag request

  2. Regula Mallesham says

    Jathiya jenda request sir

Leave A Reply

Your Email Id will not be published!