Covid19 India : రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు

ఒక్క రోజే 10 వేల‌కు పైగా కేసులు

Covid19 India : క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ త‌న ప్ర‌భావాన్ని చూపుతోంది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా కొత్త గా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. కేంద్రం ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని, కేసుల పురోగ‌తిపై అప్ డేట్ ఇవ్వాల‌ని సూచించింది.

అంతే కాకుండా ఆస్ప‌త్రుల‌లో బెడ్స్ , ఆక్సిజ‌న్ , మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో మాక్ డ్రిల్ కూడా చేప‌ట్టింది.

తాజాగా గురువారం ఉద‌యం నాటికి ఏకంగా దేశంలో 10,158 కొత్త కోవిడ్ కేసులు(Covid19 India) న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 30 శాతం ఎక్కువ కావ‌డం విశేషం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. ఇక మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,42,10,127కి చేరుకుంది.

రోజూ వారీ పాజిటివిటీ రేటు 4.42 శాతం న‌మోదు కాగా వారం వారీ పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ ల‌లో 0.10 శాతంగా ఉంది. రిక‌వ‌రీ రేటు 98.71 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.19 గా న‌మోదైంద‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Also Read : గూగుల్ లో మ‌రికొంద‌రికి ఉద్వాస‌న – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!