Covid19 : దేశంలో కొత్తగా 131 కరోనా కేసులు
బూస్టర్ డోస్ తీసుకోవాలన్న కేంద్రం
Covid19 : ఓ వైపు చైనాను కరోనా భూతం కమ్మేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయి దేశాలు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
అంతే కాకుండా బూస్టర్ డోస్ కూడా విధిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 131 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక క్రియాశీల కేసుల సంఖ్య కూడా 1,940కి తగ్గింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయి. ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం తాజాగా నమోదైన 131 కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా(Covid19) కేసుల సంఖ్య 4,46,81,781 నమోదయ్యాయి.
ఇవాళ ఉదయం 8 గంటల వరకు కేరళలో ఒకరు కరోనా కారణంగా మరణించగా యూపీలో మరొకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 5,30,730కి చేరుకుంది. రోజూ వారీ , వారం వారీ సానుకూలత రెండూ 0.08 శాతంగా నమోదయ్యాయి. కాగా జాతీయ కోవిడ్ 19 రికవరీ రేటు 98.91 శాతానికి పెరిగింది.
చైనాలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం.
Also Read : రాహుల్ యాత్రలో 26/11 బాధితురాలు