Goldy Brar : గోల్డీ బ్రార్ ను అప్ప‌గించాల‌న్న భార‌త్

కెన‌డా ప్ర‌భుత్వాన్ని కోరిన కేంద్రం

Goldy Brar : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్దూ హ‌త్య కేసుకు తానే బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడ‌యా వేదిక‌గా ప్ర‌క‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ గోల్డీ బ్రార్(Goldy Brar) ను అప్ప‌గించాల‌ని భార‌త్ కెన‌డా ను కోరింది.

చ‌దువుకునేందుకు అని కెనడాకు 2017లో వెళ్లాడు. అక్క‌డి నుంచే తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ లీడ‌ర్ లారెన్స బిష్ణోయ్ స‌హ‌కారంతో ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కాల్పుల కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో షూట‌ర్లు కూడా ఉన్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే గోల్డీ బ్రార్(Goldy Brar) పై ఇంట‌ర్ పోల్ రెడ్ కార్న‌ర్ నోటీసు జారీ చేసింది.

అత‌డిని దేశం నుంచి ఇక్క‌డికి పంపించాల‌ని ఒట్టావాను కోరింది భార‌త ప్రభుత్వం. పంజాబ్ లోని శ్రీ ముక్త్ స‌ర్ సాహిబ్ లో పుట్టాడు స‌తీంద‌ర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్. అత‌డి వ‌య‌స్సు 28 ఏళ్లు.

భార‌త దేశం అభ్య‌ర్థ‌న మేర‌కు బ్రార్ పై హ‌త్యా ప్ర‌య‌త్నం, నేర‌పూరిత కుట్ర‌, అక్ర‌మ ఆయుధాల స‌ర‌ఫ‌రా కింద అభియోగాలు మోపారు. ముందుగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ఒప్పందం మేర‌కు నోటీసు ఇస్తారు.

అదుపులోకి తీసుకున్న అనంత‌రం అప్ప‌గించే చాన్స్ ఉంటుంది. గ‌త నెల‌లో మాన్సా జిల్లాలో సింగ‌ర్ సిద్దూ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. దీనికి తామే బాధ్య‌త అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు బ్రార్.

అది నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఇక గోల్డీ బ్రార్ యూత్ కాంగ్రెస్ నేత గుర్లాల్ పెహ్లాన్ హ‌త్య కేసులో ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

Also Read : సిద్దూ హ‌త్య కేసులో షూట‌ర్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!