Lalu Prasad Yadav : అంతర్యుద్దం దిశగా భారతదేశం – లాలూ
కేంద్ర సర్కార్ పై లాలూ కన్నెర్ర
Lalu Prasad Yadav : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
భారత దేశం అంతర్యుద్దం దిశగా పయనిస్తోందంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్.
లౌకిక శక్తులు ఏకం కావాలని, కలిసి పోరాడాలని అన్నారు. మోదీ సంకీర్ణ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అప్పుల కుప్పగా మారి పోయిందన్నారు.
కులాలు, మతాలు, వర్గాల పేరుతో విభజిస్తూ పాలన సాగిస్తున్న మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు తప్పకుండా వస్తుందన్నారు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav). ప్రభుత్వం పని చేస్తున్న విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేకతతో కూడుకుని ఉందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి కట్టుగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం. సంపూర్ణ క్రాంతి దివస్ సందర్భంగా వర్చువల్ గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసంగించారు.
ఓ వైపు పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు వరకు మోదీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర సర్కార్ కు ఈరోజు వరకు యాక్షన్ ప్లాన్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
Also Read : ఢిల్లీ మంత్రి జైన్ నివాసాలలో ఈడీ దాడులు