India Blocks PFI : పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా బ్లాక్
మరోసారి షాక్ ఇచ్చిన భారత్
India Blocks PFI : పాకిస్తాన్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా దేశంలో వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ, పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
ఈ మేరకు వాటిని బ్యాన్ చేస్తూ వచ్చింది. ప్రమాదకరమైన సైట్స్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను నిషేధించాలని కేంద్రం టెలికాం శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తాజాగా భారత్ లో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్(India Blocks PFI) ఖాతా మళ్లీ నిలిపి వేసింది.
అదికారిక హ్యాండిల్ కు సంబంధించిన ట్విట్టర్ పేజీలో చట్ట పరమైన డిమాండ్ కు ప్రతిస్పందనగా భారత దేశంలో పాకిస్తాన్ అధికారిక ఖాతా నిలిపి వేసినట్లు పేర్కొంది. కాగా పాకిస్తాన్ పై ఇది మొదటి దాడి కాదు. ఖాతా ఇంతకు ముందు కూడా నిలిపి వేసింది. జాతీయ మీడియా ఏఎన్ఐ నివేదిక ప్రకారం జూలైలో భారత దేశం అనేక పాకిస్తాన్ కు(India Blocks PFI) చెందిన ఖాతాలను బ్లాక్ చేసింది.
తర్వాత మళ్లీ యాక్టివేట్ చేశారు. ఇది నెల రోజుల కిందటే జరిగిందని తెలిపింది. ట్విట్టర్ మార్గదర్శకాల ప్రకారం మైక్రో బ్లాగింగ్ సైట్ కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్ట పరమైన డిమాండ్ కు ప్రతిస్పందనగా ఇటువంటి చర్య తీసుకుంటుంది.
ఇదిలా ఉండగా భారత దేశంలోని ట్విట్టర్ యుఎన్ , టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాల అధికారిక ఖాతాలను నిషేధించింది. ఆగస్టులో 8 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెళ్లను బ్లాక్ చేసింది. అందులో ఒకటి పాకిస్తాన్ నుంచి పని చేస్తోంది.
Also Read : ఎగతాళి చేసిన వారే విస్తు పోతున్నారు – మోదీ