Boris Johnson : భారత్ యుకె మధ్య బంధం పటిష్టం – జాన్సన్
వాణిజ్య ఒప్పందంపై ఫోకస్ పెట్టాలి
Boris Johnson : బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(Boris Johnson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే ప్రస్తుతం కొలువు తీరిన రిషి సునక్ సారథ్యంలో యుకె భారత్ తో మరింత బంధాన్ని కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాలకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని పిలుపునిచ్చారు మాజీ ప్రధాన మంత్రి.
దాని కోసం వచ్చే దీపావళి వరకు వేచి ఉండలేమన్నారు. యుకెకు వచ్చే విద్యార్థులలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆధ్వర్యంలో యుకె , భారత్ మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటాయన్నారు. గతంలో కంటే మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
శనివారం ఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో బోరిస్ జాన్సన్ పాల్గొని ప్రసంగించారు. తాము ప్రమాదకరమైన, అల్ల కల్లోలమైన కాలంలో జీవిస్తున్నామని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచానికి ముఖ్యంగా రెండు దేశాలకు ఒకరినొకరు అత్యంత సహకరించు కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు బోరిస్ జాన్సన్(Boris Johnson).
రెండు దేశాలకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నేను గుజరాత్ ను సందర్శించాను. ఎక్కడ చూసినా టెండూల్కర్ కు వెల్ కమ్ చెప్పినట్టుగా ఉందన్నారు. తాను నాయకత్వం వహించిన ఏ మిషన్ విజయవంతం కాలేదన్నారు.
ప్రతి చోటా నా చిత్రాలు ఉండడం ఆనందం అనిపించిందన్నారు. భారత్ తో తనకు చిరకాల బంధం ఉందన్నారు జాన్సన్.
Also Read : ‘పరదా’పై పర్మిదా ఘసేమి కన్నెర్ర