India Warning Bhutto : మోదీపై కామెంట్స్ బిలావర్ కు వార్నింగ్
నోరు పారేసుకున్న పాక్ విదేశాంగ మంత్రి
India Warning Bhutto : పాకిస్తాన్ తన అక్కసు ఇంకా వెళ్లగక్కుతూనే ఉంది భారత్ పై. తాజాగా ఆ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి బిలావర్ భుట్టో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్ చని పోయాడు. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నాడంటూ మోదీని ఉద్దేశించి అన్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భారత్. ఇంకోసారి నోరు జారితే బాగుండదని హెచ్చరించింది. ఇప్పటికే ఐక్య రాజ్య సమితిలో భద్రతా మండలికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం గురించి మీకు సమాధానం కావాలంటే పాకిస్తాన్ ను అడగాలని అన్నారు. అంతే కాదు యావత్ ప్రపంచం పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించిందని , దానికి రోజు రోజుకు ప్రపంచ పటంలో స్థానం అంటూ ఉండదని హెచ్చరించారు. ఈ తరుణంలో బిలావర్ భుట్టో నోరు పారేసు కోవడం కలకలం రేపింది.
దీనిపై భారత్ సీరియస్(India Warning Bhutto) అయ్యాయి. పాక్ విదేశాంగ మంత్రి 1971 రోజును మరిచి పోయినట్లు ఉన్నారు. పాకిస్తాన్ తన మైనార్టీల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉంటుంది. ఇది లోకానికి అంతా తెలుసు. తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది.
మారణ హోమాన్ని సృష్టిస్తున్నది ఎవరో ఆ దేశానికి తెలియదా అని ప్రశ్నించింది భారత్. ఇకనైనా తమ పరిధిలో ఉంటే బెటర్..లేక పోతే తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది ఇండియా.
Also Read : ప్రపంచం పాక్ ను ఉగ్రవాద దేశంగా చూస్తోంది