YS Jagan : భారత రాజ్యాంగం స్పూర్తిదాయకం – జగన్
రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండ
YS Jagan : దేశానికి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగేలా తోడ్పాటు అందించడంలో భారత రాజ్యాంగం కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). శనివారం రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
ప్రపంచంలోనే మన రాజ్యాంగం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మనకు అందించిన వారందరికీ పేరు పేరునా మనం రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం.
రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందుతూ విధుల గురించి కూడా ఆలోచించాలన్నారు. ప్రధానంగా తన జీవిత కాలమంతా రాజ్యాంగం రాసేందుకు సర్వ శక్తులను ధార పోసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను స్మరించు కోవాలన్నారు.
ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మన దేశ రాజ్యాంగానికి పేరుందని చెప్పారు. రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. ప్రతి ఒక్కరికీ ఎలా బతకాలో కూడా నేర్పుతుందన్నారు.
మనం ఏమిటో, మన హక్కులు ఏమిటో, మన విధులు ఏమిటో అనేది రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తంగా భారత రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ప్రశంసించారు.
అంతకు ముందు గవర్నర్ హరిచందన్ విశ్వ భూషణ్ , సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బహుజనులు, పేదలు, మైనార్టీలకు అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్న ఘనత తమదేనని అన్నారు సీఎం.
Also Read : రాజ్యాంగం వల్లనే తెలంగాణ సాకారం