Indian Cricket : సమున్నత భారతం క్రికెట్ ఓ మతం
కోట్లు కుమ్మరిస్తున్న గిల్లీ దండా
Indian Cricket : ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్వంలో నిర్వహించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మీడియా రైట్స్ . భారత దేశ చరిత్రలో కనీ విని ఎరుగని డీల్ ఇది.
ఏకంగా రూ. 48, 390 కోట్లు కేవలం ఐదేళ్ల (2023-2027) కాలానికి గాను ఈ వేలం పాట చేపట్టింది బీసీసీఐ. ఇందులో డిజిటల్, టీవీ రైట్స్ కోసం. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు పోటీ పడ్డాయి.
డిస్నీ స్టార్, రిలయన్స్ వయా కామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ చివరకు దక్కించుకున్నాయి. ఒకప్పుడు భారత దేశం అంటేనే హాకీ. అది మన
జాతీయ క్రీడ. కానీ ఎప్పుడైతే క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలో భారత క్రికెట్(Indian Cricket) జట్టు 1983లో వరల్డ్ కప్ సాధించి తీసుకు వచ్చాడో.
ఆనాటి నుంచి నేటి దాకా క్రికెట్ భారత దేశాన్ని అల్లుకు పోయింది. క్రికెట్ అంటే ఈ దేశంలో చిన్నారుల నుంచి వృద్దుల దాకా గల్లీల నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా క్రికెట్ కనిపిస్తోంది. వినిపిస్తూ ఉంటుంది.
ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా లాంటి దేశం కూడా క్రికెట్ వైపు చూస్తోంది. ఆ దేశంలో సైతం క్రికెట్ ను ఆడుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ జపం చేస్తున్నారు. అరబ్ కంట్రీస్ సైతం ఫోకస్ పెట్టాయి.
ఇక క్రికెట్ ను జనరంజకంగా మలిచిన ఆటగాళ్లలో ప్రధానంగా చెప్పు కోవాల్సింది ఆద్యుడు కపిల్ అయితే దానిని మరింత పాపులర్ గా చేసిన వారిలో మాత్రం అజహరుద్దీన్ నాయకత్వం వహించిన కాలం అని చెప్పక తప్పదు.
ఎందుకంటే ఎనలేని విజయాలు సాధించి పెట్టాడు. ఫిక్సింగ్ భూతం అన్నది లేక పోయి ఉండి ఉంటే ఇవాళ అజ్జూ భాయ్ క్రికెట్ రంగాన్ని శాసించి ఉండేవాడు.
ఆ తర్వాత అతడి సారథ్యంలోనే సచిన్ మెరిశాడు. ద్రవిడ్ రాణించాడు. గంగూలీ దుమ్ము రేపాడు. కోహ్లీ, ధోనీ దానికి మరింత ఆదరణ వచ్చేలా చేశారు.
ఇక క్రికెట్ కు వ్యాపార కళను అద్దింది. దానికి ఓ రూపు రేఖలు తీసుకు వచ్చేలా చేసింది మాత్రం రాజ్ సింగ్ దుర్గాపూర్ , జగన్మోహన్ దాల్మియా . ఆ తర్వాత లలిత్ మోదీని ప్రస్తావించక తప్పదు.
2008లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఐపీఎల్ ను స్టార్ట్ చేశాడు. అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఇంగ్లండ్ లో ఉన్నాడు. ఇక ఆనాటి నుంచి
నేటి దాకా కోట్లు వచ్చి చేరుతున్నాయి బీసీసీఐ గల్లా పెట్టెల్లోకి.
ప్రస్తుతం ఐపీఎల్ ఓ ఆట కాదు అది దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. భారత దేశ క్రీడా (Indian Cricket)చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. అంతకంటే అద్భుత రికార్డు నమోదు చేసింది.
ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రిచ్ లీగ్ లలో నాలుగో లీగ్ గా నిలిచింది. భారత దేశం అంటే 145 కోట్ల జనం ముక్త కంఠంతో నినదించే ఏకైక పదం..క్రికెట్. అది ఆట కాదు ఓ మతం.
Also Read : తిప్పేసిన యుజ్వేంద్ర చాహల్..పటేల్