Nirmala Sitharaman : సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎలాంటి విపత్తులు ఎదుర్కొనేందుకైనా తాము రెడీగా ఉన్నామని చెప్పారు. రాబోయే 15 ఏళ్లు మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్నారు. వాటిని ఢీకొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు ఆర్థిక మంత్రి.
2020 మార్చిలో కరోనా మహమ్మారి దెబ్బకు విధాన పరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదుడుకులకు లోనైందన్నారు. అనంతరం కొంత కాలం తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో భారత్ పుంజుకుందన్నారు.
ఈ తరుణంలో రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ఉపద్రవం వచ్చి పడిందన్నారు. దీని వల్ల మరింత ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడిందన్నారు నిర్మలా సీతారామన్.
ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు, డిజిటలైజేషన్ , వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, దివాలా కోడ్ వంటి చర్యలు ఉన్నామని ఆమె చెప్పారు.
ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ కింద జరిగిన ఐకానిక్ డే సెలబ్రేషన్స్ లో సీతారామన్(Nirmala Sitharaman) మాట్లాడారు. రాబోయే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. దాని ప్రభావాన్ని భారత్ ఎదుర్కొందన్నారు. 1991లో సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో దేశం సవాళ్లను ఎదుర్కొందన్నారు.
దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందన్నారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).
Also Read : పర్యావరణ ఇండెక్స్ పై కేంద్రం ఫైర్