Imran Khan : భారత విదేశాంగ విధానం భేష్ – ఇమ్రాన్
ప్రశంసలు కురిపించిన మాజీ ప్రధానమంత్రి
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత దేశాన్ని ప్రశంసించారు. ఆయన మన దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఓ బహిరంగ సభలో ఏకంగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పాకిస్తాన్ కు అలాంటి విధానమే లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఇదే సమయంలో ముందుగా మే , 2022లో అమెరికా నుండి తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్పప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించు కోలేదని పేర్కొన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఇమ్రాన్ ఖాన్. యుఎస్ ను కాదని ఏకంగా రష్యాతో డీల్ కుదుర్చు కున్నారని తక్కువకు దొరికే క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేశారని కానీ పాకిస్తాన్ పాలకవర్గం అలా చేయలేక పోయిందని ఎద్దేవా చేశారు మాజీ ప్రధానమంత్రి.
మరో వైపు చమురు వ్యాపారం కోసం గత ఏడాది నుంచి పాకిస్తాన్ , రష్యాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఒక వీడియో సందేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. నా హయాంలోనే ఒప్పందం చేసుకోవాలని అనుకున్నామని కానీ దురదృష్టవశాత్తు అవిశ్వాస తీర్మానం కారణంగా తన ప్రభుత్వం పడి పోయిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలోనే దేశంలో ఎన్నికలు జరగపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మోదీ ఐకానిక్..వరల్డ్ లీడర్ – పీటర్సన్