Arindam Bagchi : తాలిబ‌న్ల‌తో భార‌త బృందం భేటీ

ఆఫ్గ‌నిస్తాన్, భార‌త్ దేశాల మ‌ధ్య కొత్త బంధం

Arindam Bagchi : ఆఫ్గ‌నిస్తాన్ ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్న అనంత‌రం తొలిసారిగా భార‌త దేశ అధికారిక బృందం గురువారం ఆ దేశ రాజ‌ధాని కాబూల్ లో కాలు మోపింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న తాలిబ‌న్ల‌తో భార‌త బృందం క‌లుసుకుంది. కొత్తగా ఏర్పాటైన ఆఫ్గ‌నిస్తాన్ పాల‌న‌లో ఇది మొద‌టిది. యుఎస్ బ‌ల‌గాల నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత తాలిబ‌న్ దేశాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

దీంతో గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆఫ్గ‌నిస్తాన్ నుండి భార‌తీయ మిష‌న్ సిబ్బంది అంద‌రూ తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల ఆర్థిక ఆంక్ష‌లు విధించ‌డంతో ఆఫ్గ‌నిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.

ఇప్ప‌టికే ఏ దేశం చేయ‌లేని స‌హాయం భార‌త్ ఆ దేశానికి చేసింది. ఆక‌లితో ఉన్న వారిని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున గోధుమ‌ల‌ను అందించింది.

అంతే కాకుండా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న వారికి ఉచితంగా వ్యాక్సిన్లు , మందుల‌ను పంపిణీ చేసింది. ఈ సంద‌ర్భంగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా భార‌త్ కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

తాజాగా మాన‌వ‌తా సహాయంపై చ‌ర్చించేందుకు భార‌త దేశానికి చెందిన ఉన్న‌తాధికారులు , తాలిబ‌న్లు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. వీరి భేటి యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది.

ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌జ‌ల‌తో భార‌త దేశానికి చారిత్ర‌క‌, నాగ‌రిక‌త సంబంధాలు ఉన్నాయ‌ని భార‌త దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి(Arindam Bagchi) స్ప‌ష్టం చేశారు.

మిస్ట‌ర్ సింగ్ తో స‌మావేశమ‌య్యారు తాలిబాన్ కు చెందిన అమీర్ ఖాన్ మొట్టాకి. దేశంలో నిలిచి పోయిన ప్రాజెక్టుల‌ను దౌత్య ప‌ర‌మైన ఉనికిని భార‌త దేశం తిరిగి ప్రారంభించాల‌ని కోరారు.

విద్యార్థులు, రోగుల‌కు సేవ‌లు అందించాల‌ని విన్న‌వించారు. వాణిజ్య ప‌రంగా కూడా ఇరు దేశాలు క‌లిసి ప‌ని చేయాల‌ని సూచించారు.

Also Read : ఆర్మీ నిర్వాకం వ‌ల్లే ప‌ద‌వి కోల్పోయా

Leave A Reply

Your Email Id will not be published!