Rahul Gandhi : ఐసీయూలో భారత రూపాయి – రాహుల్
ప్రధాన మంత్రి మోదీపై తీవ్ర ఆగ్రహం
Rahul Gandhi : గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత రూపాయి క్షీణించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
పక్కనే ఉన్న ద్వీప దేశం శ్రీలంక ఎన్నడూ లేని రీతిలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏదో ఒక రోజు శ్రీలంక పరిస్థితే భారత్ లో నెలకొనడం ఖాయమని పేర్కొన్నారు.
ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత రూపాయి ఐసీయూలో ఉందని, ఇప్పట్లో బలపడటం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న పీఎం ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
రూపాయి ఒక్క రోజులోనే పతనం కావడం ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోందని ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్పందించక పోవడం క్షమించ రాని నేరమని అన్నాడు.
ముందు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశాడు. ప్రచారంలో ఉన్నంత శ్రద్ద మోదీకి ప్రజా సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తర్వాత ఇది వరుసగా ఎనిమిదో వారం రూపాయి క్షీణించడం. దేశాన్ని చీకటి మయంలోకి నెట్టేసిన ప్రధాన మంత్రికి ప్రజలు చుక్కలు చూపించే రోజు తప్పకుండా వస్తుందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) జోష్యం చెప్పారు.
బతుకు దెరువు భారంగా మారింది. డజిల్ , వంట గ్యాస్ , సీఎన్ జీ, పీఎన్ జీ అన్ని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు.
Also Read : ఆ ఘటన బాధాకరం – సీఇఓ