Shyam Sharan Negi : భారత దేశపు మొదటి ఓటరు ‘నేగి’ మృతి
ప్రభుత్వ గౌరవంతో అంత్యక్రియలు
Shyam Sharan Negi : స్వతంత్ర భారత దేశంలో మొట్ట మొదటి ఓటరుగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ శరణ్ నేగి ఇవాళ కన్ను మూశారు. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతోంది. విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో తన విలువైన ఓటును వినియోగించుకున్నారు నేగి. 14వ శాసనసభ ఎన్నికల్లో ఈ ఏడాది నవంబర్ 2న శ్యామ్ శరణ్ నేగి 34వ సారి ఓటు వేశారు. ఇది దేశ చరిత్రలో ఓ రికార్డు. నేగి అక్టోబర్ 23, 1951లో స్వతంత్ర భారత దేశంలో తన మొట్ట మొదటి ఓటు వేశారు.
ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎన్నికల చరిత్రలో శ్యామ్ శరణ్ నేగి నిలిచి పోయింది. ఆయనే మొదటి ఓటు వేయడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ లోని కల్పాలో తన స్వస్థలంలో తుది శ్వాస విడిచారు. నేగి తన మొదటి ఓటును 1951లో కల్ప పోలింగ్ కేంద్రంలో వేశారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
34వ సారి నేగి తన ఓటు హక్కు వినియోగించు కున్నందుకు గాను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా ఆయనను అభినందించారు. ఓటుకు ఉన్న విలువ ఏమిటో, దాని ప్రాధాన్యత ఏమిటో, అది ఎలా దేశాన్ని ప్రభావితం చేస్తుందో శ్యామ్ శరణ్ నేగిని(Shyam Sharan Negi) చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పాల్గొనేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు యువ ఓటర్లకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు మోదీ. 106 ఏళ్ల వయస్సు ఉన్న నేగి ఈనెల 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు వేశారు. ఇదిలా ఉండగా మొదటి ఓటరుగా చరిత్ర సృష్టించిన నేగి అంత్యక్రియలను ప్రభుత్వమే దగ్గరుండి జరిపిస్తుందని ప్రకటించింది సర్కార్.
Also Read : ఇళ్లను కూల్చేస్తే సర్కార్ కూలుతుంది