Manish Chopra Meta : ఐసీసీతో భాగస్వామ్యం భారత్ ముఖ్యం
మెటా ఇండియా డైరెక్టర్ మనీష్ చోప్రా
Manish Chopra Meta : ఫేస్ బుక్ – మెటా ఇండియా డైరెక్టర్ , భాగస్వామ్య అధిపతి మనీష్ చోప్రా(Manish Chopra) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మెటా తన ప్లాట్ ఫారమ్ ల కోసం చూస్తే తమకు భారత దేశం అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. మంగళవారం మనీష్ చోప్రా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇటీవలే మెటా – ఫేస్ బుక్(Meta – Facebook) ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇది పురుషుల టి20 ప్రపంచ కప్ లోని అత్యుత్తమ క్షణాలు, ముఖ్యాంశాలను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు, అభిమానులకు అందజేస్తోంది మెటా.
ఇది ఒక రకంగా వ్యాపార పరంగా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు మెటాకు దక్కనున్నాయి. తమ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన రీల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయని చెప్పారు మెటా ఇండియా డైరెక్టర్ మనీష్ చోప్రా. ప్రధానంగా ఈ దేశంలో ఎక్కువగా మార్కెట్ కు స్కోప్ మాత్రం క్రికెట్ ద్వారానే ఉందని తాము గుర్తించామన్నారు.
ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ లలో ఫీచర్ చేసే అన్ని కొత్త విషయాల పరంగా మెటాకు భారత దేశం అత్యంత ముఖ్యమైన దేశంగా అభివర్ణించారు ఇండియా డైరెక్టర్.
మెటా అనేక బ్రాండ్ లు, మిలియన్ల మంది క్రియేటర్లకు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించేందుకు , షార్ట్ ఫారమ్ వీడియోల ద్వారా భారత దేశంలో ప్రేక్షకులను పెంచుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రీల్స్ ద్వారానే అత్యధికంగా మార్కెట్ వస్తోందన్నారు.
Also Read : వాట్సాప్ సర్వీసులకు అంతరాయం