S Jai Shankar : చైనాతో భారత్ సంబంధాలు కష్టం – జై శంకర్
సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే తప్ప
S Jai Shankar : భారత దేశ కేంద్ర శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా భారత్, డ్రాగన్ చైనా దేశాల మధ్య సత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొంటనే తప్పా చైనాతో సయోధ్య సాధ్యం కాదని స్పష్టం చేశారు జై శంకర్(S Jai Shankar) .
తాము ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటున్నామే తప్పా యుద్దాన్ని కాదన్నారు. ప్రతి దేశంతో తాము ఆరోగ్యకరమైన సంబంధాలను ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ చైనా మాత్రం దూరాన్ని పాటిస్తోందంటూ ధ్వజమెత్తారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు కీలక సమావేశాలలో భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి పూర్తిగా వివరించడం జరిగిందన్నారు.
ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత ఉంటే తప్ప, ఒప్పందాలను పాటించక పోతే , యథాతథ స్థితిని మార్చేందుకు ఏక పక్ష ప్రయత్నం చేయక పోతే సంబంధాలు సాధారణమైనవి కావన్నారు సుబ్రమణ్యం జై శంకర్. గాల్వాన్ వ్యాలీ ఘర్షణలను ప్రస్తావించారు. కేవలం ఉద్దేశ పూర్వకంగా చైనా వ్యవహరిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
చాలా మటుకు సాధ్యమైనంత మేరకు అవకాశం వచ్చిన ప్రతిసారి తాము చైనాకు భారత దేశం తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చిందన్నారు సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) .
ఇదిలా ఉండగా మరోసారి జిన్ పింగ్ చైనాకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కూడా ఇండియాకు ఇబ్బందికరంగా మారిందన్న విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చైనాలో ప్రస్తుత పరిస్థితులు తమకు ఆసక్తిగా లేవన్న విషయం గ్రహించాలన్నా కేంద్ర మంత్రి.
Also Read : ఉద్దేశం మంచిదైతే లక్ మీ బానిస – టెమ్ జెన్