Indrani Mukarjea : ఇంద్రాణి ముఖ‌ర్జీకి బెయిల్ మంజూరు

6.5 ఏళ్ల పాటు జైలు జీవితం

Indrani Mukarjea : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఇంద్రాణి ముఖ‌ర్జీ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌రించింది. 2012లో 25 ఏళ్ల షీనా బోరా హ‌త్య కేసులో ఇంద్రాణి ముఖ‌ర్జీ విచార‌ణ‌ను ఎదుర్కొంటోంది.

ఆద్యంత‌మూ సినిమా థ్రిల్ల‌ర్ ను గుర్తు చేసిన ఈ కేసు దేశాన్ని ఆక‌ర్షించింది. దీంతో ఇంద్రాణి ముఖర్ఝియా 2015 నుంచి జైలులోనే ఉన్నారు. ఇంద్రాణి ముఖ‌ర్జీ(Indrani Mukarjea) ఎవ‌రో కాదు మీడియా ప్ర‌ముఖుల్లో ఒక‌రు. మాజీ ఎగ్జిక్యూటివ్ గా ప‌ని చేశారు.

త‌న కుమార్తె షీనా బోరాను హ‌త్య చేసిన కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ఇవాళ కేసును విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంద్రాణి ముఖ‌ర్జీ సుదీర్ఘ కాలం త‌ర్వాత విడుద‌ల కానుంది.

ఇంద్రాణి ముఖ‌ర్జీ డ్రైవ‌ర్ శ్యామ్ వ‌ర్ రాయ్ , మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నా స‌హాయంతో షీనా బోరాను హ‌త్య చేశార‌ని కేసు న‌మోదైంది. ఇంద్రాణీ ముఖ‌ర్జీ(Indrani Mukarjea) త‌న కూతురుకు త‌న భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జియా త‌న‌యుడు రాహుల్ ముఖ‌ర్జియాతో అంత‌కు ముందు వివాహం జ‌రిగింది.

ఆనాటి నుంచి కోపం పెంచుకుంద‌ని అధికారులు తెలిపారు. ముంబై లోని బైకుల్లా మ‌హిళా జైలులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఇంద్రాణి ముఖ‌ర్జియా త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాదించారు.

ఆమెకు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ప‌లుమార్లు బెయిల్ నిరాక‌రించింది. కాగా ఇంద్రాణి ఇప్ప‌టికే చాలా కాలం జైలులో గ‌డిపినందున బెయిల్ పొందేందుకు అర్హురాలంటూ బీ.ఆర్. గ‌వాయ్ , ఏ.ఎస్. బోప‌న్న‌తో కూడిన ధర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

ఇంద్రాణికి సాయం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై నెల రోజుల త‌ర్వాత అరెస్టైన పీట‌ర్ ముఖ‌ర్జీకి 2020లో బెయిల్ ల‌భించింది.

Also Read : కాంగ్రెస్ పార్టీకి షాక్ హార్దిక్ ప‌టేల్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!