IND vs AUS 3rd Test : అద్భుతం జరిగేనా భారత్ గెలిచేనా
ఆసిస్ ముంగిట 76 పరుగుల లక్ష్యం
INDvsAUS Test 3rd : ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ముంగిట నిలిచింది. విజయం సాధించాలంటే కేవలం 76 పరుగులు చేయాల్సి ఉంది(INDvsAUS Test 3rd). పూర్తిగా స్పిన్ కు అనుకూలంగా ఉన్న ఈ మైదానంపై ఆ మాత్రం రన్స్ చేయాలంటే ఆసిస్ ఆటగాళ్లు కష్టపడాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా వికెట్లు సమర్పించు కోవాల్సిందే.
సరిగ్గా 19 ఏళ్ల కిందట 2004లో ముంబై వేదికగా జరిగిన టెస్టులో ఆసిస్ ముంగిట 107 రన్స్ లక్ష్యం. కానీ కానీ భారత్ చేతిలో 93 రన్స్ కే చాప చుట్టేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 163 రన్స్ కు ఆలౌటైంది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 రన్స్ చేసింది.
ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చేసిన స్పిన్ మాయాజాలానికి భారత బ్యాటర్లు విల విల లాడారు. ఒక్క ఛతేశ్వర్ పుజారా , శ్రేయస్ అయ్యర్ తప్ప వేరెవరూ రాణించ లేదు. నాథన్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. పుజారా 59 రన్స్ చేస్తే , అయ్యర్ 26, రోహిత్ శర్మ 12, శుభ్ మన్ గిల్ 2, కోహ్లీ 13, రవీంద్ర జడేజా 4, కేఎస్ భరత్ 3, రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులు చేశారు. ఇక ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ , కునెమన్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ 156 రన్స్ తో ప్రారంభించిన ఆసిస్ రెండో రోజు(IND vs AUS) స్వల్ప వ్యవధిలోనే వికెట్లను పారేసుకుంది. ఉమేష్ యాదవ్ , రవి చంద్రన్ అశ్విన్ అద్భుత బౌలింగ్ తో తక్కువ పరుగులకే చాప చుట్టేసింది. 197 రన్స్ కు ఇన్నింగ్స్ ముగిసింది.
Also Read : ఆర్సీబీ కొత్త జెర్సీ హల్ చల్