INDW vs ENGW 3rd ODI : మన్కడ్ వ్యవహారంపై ఎడతెగని రగడ
మూడవ వన్డే మ్యాచ్ లో భారత్ విక్టరీ
INDW vs ENGW 3rd ODI : క్రికెట్ అంటేనే బంతికి బ్యాట్ కు మధ్య జరిగే పోరాటం. ఒక్కోసారి అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఉత్కంఠ భరితమైన సన్నివేశానికి వేదికైంది భారత్, ఇంగ్లండ్ మహిళల(INDW vs ENGW 3rd ODI) మూడో వన్డే మ్యాచ్.
హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వన్డే సీరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ లో దీప్తి శర్మ చేసిన మన్కడ్ ప్రయోగం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ క్రికెటర్ చార్లీ డీన్ ను దీప్తి శర్మ రనౌట్ (మన్కడ్ ) చేయడంతో ఉత్కంఠ భరితంగా సాగింది ఈ మ్యాచ్. దీంతో మ్యాచ్ నాటకీయంగా ముగిసింది.
16 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. భారత్ కేవలం 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు భారతీయ మహిళా క్రికెటర్లు.
గెలిచేందుకు 50కి పైగా పరుగులు కావాలి. కానీ దీప్తి శర్మ తన ఇన్నింగ్స్ ను ముగించినప్పుడు 9వ నంబర్ క్రికెటర్ చార్లీ డీన్ ను మన్కడ్ విధానంతో రనౌట్ చేసింది.
ప్రస్తుతం ఈ చర్య తీవ్ర చర్చకు దారితీసింది. దీప్తి డీన్ బ్యాకప్ చేస్తున్నప్పుడు రన్ అవుట్ అయ్యింది. ఈ చర్యను సాధారణంగా మన్కడ్ అని పిలుస్తారు.
అవుట్ చేసిన తీరుపై ఆన్ ఎయిర్ కామెంట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ అమీ జోన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ తన జట్టు క్రికెటర్ దీప్తి శర్మ చేసిన రనౌట్ (మన్కడ్ )ను గట్టిగా సమర్థించింది.
Also Read : హైదరాబాద్ లో నువ్వా నేనా