INDW vs SLW 3rd ODI : భారత్ భళా శ్రీలంక విలవిల
3-0తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్
INDW vs SLW 3rd ODI : మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టుకు(INDW vs SLW 3rd ODI) కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో సత్తా చాటారు. తమదైన రీతిలో రాణించారు.
ఇప్పటికే శ్రీలంక టూర్ లో భాగంగా మూడు టి20ల సీరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా. తాజాగా మూడు వన్డేల సీరీస్ ను కూడా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన మూడో ఆఖరి వన్డే మ్యాచ్ లో దుమ్ము రేపింది మన జట్టు. ఏకంగా 39 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది.
తనకు ఎదురే లేదని చాటింది. ఈ కీలక మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. ఏకంగా 255 పరుగులు చేశారు.
దీంతో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక టీం చివరి వరకు పోరాడింది గెలుపు కోసం. భారత మహిళా బౌలర్ల దెబ్బకు 216 పరుగులకే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరి 3 వికెట్లు తీసి సత్తా చాటింది.
మేఘనా సింగ్ , పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ , డియోల్ చెరో రెండు వికెట్లు తీసి లంకకు షాక్ ఇచ్చారు. మరోసారి లంక క్రికెటర్ నీలాక్షి డిసిల్వా 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.
ఇక టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యాతయుతమైన ఇన్సింగ్స్ ఆడింది. 75 పరుగులు చేస్తే పూజా వస్త్రాకర్ 56 రన్స్ చేసి రాణించింది.
ఈ వన్డే సీరీస్ లో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటిన భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు దక్కాయి.
Also Read : ‘బెంగాల్ టైగర్’ కు బర్త్ డే విషెస్