Rakesh Tikait Attack : రాకేష్ తికాయత్ పై ఇంకు దాడి
బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన
Rakesh Tikait Attack : భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పై ఇంకు దాడి జరిగింది. సోమవారం బెంగళూరులో రాకేశ్ తికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని వద్దకు వచ్చి సిరా విసిరారు.
దీంతో ముఖమంతా సిరాతో నిండి పోయింది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు రాకేశ్ తికాయత్. ఇంకొకరు మైక్రో ఫోన్ తో దాడికి పాల్పడ్డారు.
దాంతో రైతు నాయకుడి మద్దతు దారులు వెంటనే తేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి తికాయత్ ను తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడున్న కొందరు కుర్చీలను విసిరి వేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. దేశ వ్యాప్తంగా పేరు పొందారు తికాయత్.
ఏ జాతీయ నాయకుడికి రానంతటి ప్రచారం ఆయనకు లభించింది. కాగా కర్ణాటక రైతు నాయకుడు డబ్బులు అడుగుతూ పట్టుబడిన స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు మీడియాను పిలిచారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait Attack).
సిరా దాడి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వేదిక వద్ద సరైన సెక్యూరిటీ కల్పించ లేదని ఆరోపించారు.
పోలీసులు దాడి చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఖాకీలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait Attack).
మొదటి నుంచి బీజేపీ సర్కార్ రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో దాడి జరగడం చర్చకు దారి తీసింది.
Also Read : సిద్దూ హత్య వెనుక కెనడా గ్యాంగ్‌స్టర్