Gang Rape Innova Car : గ్యాంగ్ రేప్ కేసులో ఇన్నోవా ల‌భ్యం

5గురు నిందితుల గుర్తింపు

Gang Rape Innova Car : హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ స్పందించారు.

రెండు రోజుల్లో త‌న‌కు వివ‌రాల‌తో కూడిన నివేదిక అంద‌జేయాల‌ని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిల‌ను ఆదేశించింది. దీంతో కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బాలిక రేప్ కేసులో ఐదుగురు నిందితుల‌ను గుర్తించారు. వారిలో ఇద్ద‌రు మేజ‌ర్లు ఉండ‌గా మ‌రో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు. వీరంతా ఎంఐఎంకు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల పిల్ల‌లు కావ‌డం విశేషం.

దీంతో రాజ‌కీయ ప్రాధాన్య‌త పెరిగింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఏకంగా ఫోటోలు, వీడియోలు విడుద‌ల చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది.

కాగా ఈ మొత్తం కేసులో బాలిక‌ను ప‌బ్ నుంచి తీసుకు వెళ్లి ఇన్నోవా కారు(Gang Rape Innova Car) లో అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. గ‌త వారం రోజులుగా వాడిన వాహ‌నం ఎక్క‌డుంద‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేక పోయారు పోలీసులు.

సోమ‌వారం ఫామ్ హౌస్ వ‌ద్ద నిలిపి ఉంచిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఏ6 గా ఎమ్మెల్యే కొడుకు పేరు కూడా న‌మోదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు నిందితులు వాడిన ఇన్నోవా కారు(Gang Rape Innova Car) ను పోలీసులు సీజ్ చేశారు. కాగా ఈ కారు నెంబ‌ర్ టీఎస్ 09 ఎఫ్ హెచ్ 3789 గా ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే మ‌రో రెడ్ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తంగా కేసు సంచ‌ల‌నం క‌లిగించింది.

Also Read : దేశం ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాలి – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!