GN Saibaba : జీఎన్ సాయిబాబ విడుద‌ల‌పై విచార‌ణ

బెయిల్ వ‌ద్దంటూ మ‌రాఠా స‌ర్కార్ దావా

GN Saibaba : మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబ విడుద‌ల చేయాలా వ‌ద్దా అన్న దానిపై శ‌నివారం కీల‌క‌మైన తీర్పు ప్ర‌క‌టించ‌నుంది సుప్రీంకోర్టు. భార‌త సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను తాత్కాలికంగా నిలిపి వేయాల‌ని మహారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీనిపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. అంతకు ముందు రోజు బాంబే హైకోర్టు మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబాను(GN Saibaba) నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఆయ‌న ఎలాంటి రాజ ద్రోహానికి పాల్ప‌డ‌లేద‌ని పేర్కొంది. మావోయిస్టుల‌తో ఎలాంటి సంబంధాలు ఉన్న‌ట్లు త‌మ‌కు అనిపించ లేద‌ని పేర్కొంటూ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

దీనిని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. శ‌నివారం జీఎన్ సాయిబాబాపై విచార‌ణ చేప‌ట్ట‌నుంది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. ఎనిమిది ఏళ్ల కింద‌ట మావోయిస్టుల సాయంతో దేశంపై యుద్దం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ చేశారు జీఎన్ సాయిబాబ‌ను.

ఆయ‌న దివ్యాంగుల విద్యావేత్త‌గా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా క‌ఠిన‌మైన ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం ఉపా కింద నిర్దోషిగా విడుద‌ల చేయ‌డం స‌మ‌ర్థనీయం కాద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా పేర్కొన్నారు. జీఎన్ సాయిబాబా(GN Saibaba) విద్యావేత్త ముసుగులో దేశానికి వ్య‌తిరేకంగా ఉన్న సంఘ విద్రోహ శ‌క్తుల‌కు మ‌ద్ద‌తు ప‌లికాడ‌ని ఆరోపించారు.

కాగా న్యాయ‌మూర్తులు డీవై చంద్ర‌చూడ్, హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం మొద‌ట తిర‌స్క‌రించింది. త‌న‌ను దోషిగా నిర్దారించి జీవిత ఖైదు విధిస్తూ 2017లో ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ సాయిబాబా దాఖ‌లు చేసిన అప్పీల్ ను హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ అనుమ‌తించంది.

సాయిబాబాతో పాటు జీవిత ఖైదు ప‌డిన మ‌హేష్ క‌రీమాన్ టిర్కీ, పాండు న‌రోటే (రైతులు), హేమ్ కేశ‌వ‌ద‌త్తా మిశ్రా (విద్యార్థి) , ప్ర‌శాంత్ సాంగ్లిక‌ర్ (జ‌ర్న‌లిస్ట్ ) , తిర్కీ (కూలీ)ల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించింది.

Also Read : అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ ఇవ్వొద్దు – సీబీఐ

Leave A Reply

Your Email Id will not be published!