Haryana CM : సోనాలీ ఫోగ‌ట్ హ‌త్య‌పై విచార‌ణ – సీఎం

ప్ర‌క‌టించిన మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్

Haryana CM : ప్ర‌ముఖ న‌టి, హ‌ర్యానా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు సోనాలీ ఫోగ‌ట్(Sonali Phogat) గోవాలో గుండె పోటుతో మ‌ర‌ణించారు. మొద‌ట ఈ విష‌యాన్ని తెలిపినా ఆ త‌ర్వాత కుటుంబీకులు అనుమానం వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు గోవా సీఎం రంగంలోకి దిగారు. సోనాలీ ఫోగ‌ట్ మృతిపై విచార‌ణ‌కు ఆదేశించారు. వేగ‌వంతంగా పోస్ట్ మార్టం చేశారు. ఈ రిపోర్ట్ లో గురువారం ఆస‌క్తిక‌ర , సంచ‌ల‌న వెలుగు చూశాయి.

సోనాలీ ఫోగ‌ట్ శ‌రీరంపై బ‌ల‌మైన ,మొద్దు బారిన గాయాలున్నాయ‌ని తేలింది. దీంతో సోనాలీ అసిస్టెంట్ , అత‌డి ఫ్రెండ్ క‌లిసి అత్యాచారం చేసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారంటూ కుటుంబీకులు ఆరోపించారు.

దీంతో దేశ వ్యాప్తంగా సోనాలో ఫోగ‌ట్ ది సాధార‌ణ మ‌ర‌ణం కాద‌ని అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణమ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో సోనాలీ ఫోగ‌ట్ మృతిపై స్పందించారు హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్(Haryana CM).

షాకింగ్ కామెంట్స్ చేశారు. సోనాలీ ఫోగ‌ట్ హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) తో ద‌ర్యాప్తుకు ఆదేశించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు సీఎం. గురువారం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ చండీగ‌ఢ్ లో మాట్లాడారు. గోవాతో పాటు చండీగ‌డ్ లోని ప్ర‌భుత్వ ల్యాబ్ లో కూడా ప‌రీక్షిస్తామ‌ని చెప్పారు.

కుటుంబీకులు వ్య‌క్తం చేసిన విన్న‌పాన్ని తాము మ‌న్నిస్తున్నామ‌ని ఆ మేర‌కు ద‌ర్యాప్తు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : పెగాస‌స్ స్పైవేర్ పై సీజేఐ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!