Imran Khan : అరెస్ట్ కాకుండా ఇమ్రాన్ కు ఊర‌ట

మాజీ పీఎంకు ఆగ‌స్టు 25 వ‌ర‌కు చాన్స్

Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అరెస్ట్ కాకుండా ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు ఆగ‌స్టు 25 వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కుండా తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

దేశంలోని ఉన్న‌త పోలీసు అధికారుల‌ను, మహిళా అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జీల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేసేలా ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై కేసు న‌మోదు చేసింది.

టెర్ర‌రిజం కేసులో ఆగ‌స్టు 25 వ‌ర‌కు ట్రాన్సిట్ బెయిల్ రూపంలో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించింది. శ‌నివారం జ‌రిగిన ఇస్లామాబాద్ ర్యాలీలో పోలీసులు, న్యాయ వ్య‌వ‌స్థ , ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను బెదిరించారంటూ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదైంది.

దేశ మీడియా వాచ్ డాగ్ పాకిస్తాన్ ఎల‌క్ట్రానిక్ మీడియా రెగ్యులేట‌రీ అథారిటీ ప్ర‌సంగాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌కుండా ఛాన‌ళ్ల‌ను నిషేధించింది పాకిస్తాన్.

మేజిస్ట్రేట్ అలీ జావేద్ ఫిర్యాదు మేర‌కు శ‌నివారం రాత్రి 10 గంట‌ల‌కు ఇస్లామాబాద్ లోని మ‌ర్గ‌ల్లా పోలీస్ స్టేష‌న్ లో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై కేసు న‌మోదు చేశారు.

అత్యున్న‌త పోలీసు అధికారులతో పాటు మ‌హిళా అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జీని కూడా భ‌య‌భ్రాంతాల‌కు గురి చేశార‌ని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ఇమ్రాన్ ఖాన్ కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ న్యాయ‌వాదులు బాబ‌ర్ అవాన్ , ఫైస‌ల్ చౌద‌రి ఆదివారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను త‌ట్టుకోలేక పోతోంది అక్ర‌మంగా కొలువు తీరిన షెహ‌బాజ్ ష‌రీఫ్ స‌ర్కార్ అని పీటీఐ ఆరోపించింది.

Also Read : భార‌త్ లో ఉగ్ర‌దాడికి సూసైడ్ బాంబ‌ర్ ప్లాన్

Leave A Reply

Your Email Id will not be published!