AP Inter Results 2022 : ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

రిలీజ్ చేసిన విద్యా మంత్రి బొత్స

AP Inter Results 2022 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ఎగ్జామ్స్ -2022 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో రాష్ట్ర ఉన్న‌త విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ , సెకండియ‌ర్(AP Inter Results 2022) రిజ‌ల్ట్స్ డిక్లేర్ చేశారు.

అనంత‌రం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా ఇంటర్ ఫ‌స్టియ‌ర్ లో 2,41,591 మంది ఉత్తీర్ణులు అయ్యార‌ని వెల్ల‌డించారు. ఇక ఉత్తీర్ణ‌త శాతం 54 గా న‌మోదైంద‌ని తెలిపారు.

ఇక సెకండియ‌ర్ లో 2,58,449 మంది పాస్ అయ్యార‌ని, వీరి శాతం 61గా ఉంద‌ని చెప్పారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. అయితే ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ , సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో(AP Inter Results 2022) బాలుర కంటే బాలికలే టాప్ గా నిలిచార‌ని స్ప‌ష్టం చేశారు విద్యా శాఖ మంత్రి.

ఇక రాష్ట్రంలో ఫ‌లితాల‌కు సంబంధించి జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిందన్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

ఇదే స‌మ‌యంలో విద్యార్థులు ఏమైనా అనుమానాలు ఉన్న‌ట్ల‌యితే రీకౌంటింగ్ , రీ వెరిఫికేష‌న్ కోసం జూన్ 25వ తేదీ నుంచి వ‌చ్చే నెల జూలై 5వ తేదీఈ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ అవ‌కాశాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి కోరారు. కాగా రికార్డు స్థాయిలో కేవ‌లం రాష్ట్రంలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.01 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఇక ఫ‌లితాల‌ను ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లో చూసు కోవాల‌ని సూచించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఈ సంద‌ర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలిపారు మంత్రి.

Also Read : యూనివ‌ర్శిటీల్లో పోస్టుల భ‌ర్తీకి సీఎం ఓకే

Leave A Reply

Your Email Id will not be published!