Rajender Pal Gautam : రాజేంద్ర పాల్ గౌత‌మ్ విచార‌ణ‌

ప‌హ‌ర్ గంజ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు

Rajender Pal Gautam :  ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వానికి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఓ వైపు కేంద్రం మ‌రో వైపు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్ప‌టికే స‌త్యేంద్ర జైన్ ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయ‌న జైలు ఊచ‌లు లెక్క బెడుతున్నారు.

మ‌రో వైపు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఢిల్లీ లిక్క‌ర్ స్కీంలో నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఇప్ప‌టికే 14 మందిని చేర్చింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో సోదాలు చేప‌ట్టింది. మాజీ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ ను అరెస్ట్ చేసింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మ‌రో వివాదం ఆప్ మంత్రిని చుట్టుకుంది.

దీనిని బీజేపీ ఫోక‌స్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. వేలాది మంది హిందువులు బౌద్ధ మ‌తాన్ని స్వీక‌రించిన ఘ‌ట‌న ఆప్ మంత్రి

రాజేంద్ర పాల్ గౌత‌మ్(Rajender Pal Gautam) ఇరుక్కున్నారు. ఆయ‌న ఆప్ ప్ర‌భుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. చివ‌ర‌కు తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఈ ఘ‌ట‌న అక్టోబ‌ర్ 5న రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన సామూహిక మ‌త మార్పిడి ఘ‌ట‌న‌కు సంబంధించి ఇవాళ మ‌ధ్యాహ్నం ఢిల్లీలోని ప‌హ‌ర్ గంజ్ పోలీస్ స్టేష‌న్ లో హాజ‌ర‌య్యారు.

సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది వీడియో. గౌత‌మ్ త‌న‌కు స‌మ‌న్లు అంద‌లేద‌ని తిర‌స్క‌రించిన ఒక రోజు త‌ర్వాత ప్ర‌శ్నోత్త‌రాల నోటీసుపై సంత‌కం చేయ‌డం వివాదానికి దారి తీసింది. మాజీ మంత్రిని అన్ని ప‌త్రాల‌తో వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని కోరారు స్టేష‌న్ ఆఫీస‌ర్.

Also Read : జైన్ పిటిష‌న్ పై ఈడీకి సుప్రీం నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!