Shashi Tharoor : సీపీఎం నుంచి రెబ‌ల్స్ కు ఆహ్వానం

హాజ‌రు కావ‌ద్ద‌ని మేడం ఆదేశం

Shashi Tharoor : సోనియా గాంధీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్న గులాం న‌బీ ఆజాద్ నేతృత్వంలోని జీ23లో స‌భ్యులైన రెబ‌ల్స్ కు సీపీఎం నుంచి ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందింది. ఇప్ప‌టికే విభేదించి చివ‌ర‌కు చ‌ల్ల బ‌డిన ఆజాద్ మేడం చీఫ్ గా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.

వ‌చ్చే నెల ఏప్రిల్ లో 6 నుంచి 10 వ‌ర‌కు సీపీఎం ఆధ్వ‌ర్యంలో జాతీయ స‌ద‌స్సును చేప‌డుతోంది. ఈ స‌మావేశానికి రావాల‌ని కాంగ్రెస్ రెబ‌ల్స్ నేత‌లు శ‌శి థ‌రూర్ , కేవీ థామ‌స్ , మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ల‌కు ఆహ్వానం సీపీఎం పంపించింది.

దీంతో సీపీఎం స‌ద‌స్సుకు మీరు రావ‌ద్దంటూ కేర‌ళ కాంగ్రెస పార్టీ కోరింది. ఇదే విష‌యాన్ని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి తెలిపింది. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఎవ‌రూ హాజ‌రు కావ‌ద్దంటూ ఆ పార్టీ నిషేధం కూడా విధించింది.

ఇదిలా ఉండ‌గా సోనియా గాంధీని ఢిల్లీ లోని పార్టీ పార్ల‌మెంట‌రీ కార్యాల‌యంలో కేర‌ళ‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు క‌లిశార‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా సీపీఎం స‌ద‌స్సుకు వెళ్ల‌డం ద్వారా థ‌రూర్(Shashi Tharoor) , ఇత‌ర నాయ‌కులు పార్టీని ఇబ్బంది పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ఫిర్యాదు చేసిన‌ట్లు టాక్.

సీపీఎం సెమినార్ కు ఆహ్వానించిన నేత‌లు కేర‌ళ రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని సోనియా గాంధీ పేర్కొన్న‌ట్లు తెలిసింది. రెండేళ్ల కింద‌ట పార్టీ నాయ‌క‌త్వం మారాల‌ని లేఖ రాశారు.

బీజీపీ అద్భుత ఫ‌లితాలు సాధించిందంటూ , మోదీని ఆకాశానికి ఎత్తేశారు శ‌శి థ‌రూర్.

Also Read : ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఆప్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!