IPL 2022 Cash Prize : ఐపీఎల్ టైటిల్ గెలిస్తే రూ. 20 కోట్లు

ర‌న్న‌ర్ అప్ నిలిస్తే రూ. 13 కోట్లు

IPL 2022 Cash Prize :  ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాద‌ర‌ణ చూర‌గొన్న రిచ్ లీగ్ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022  ఈనెల 29తో పూర్త‌వుతుంది. రెండు నెల‌ల పాటు కొన‌సాగింది. కోట్లాది గుండెల్ని మీటింది.

ఊహించ‌ని రీతిలో గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్స్ కు చేరాయి. చివ‌రి అంకం పూర్త‌యితే విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంత ప్రైజ్ మ‌నీ గెలుస్తుంద‌నేది చ‌ర్చ‌కు రావ‌డం ఖాయం.

2008లో ప్రారంభ‌మైన ఈ లీగ్ రాను రాను కోట్లాది రూపాయ‌లు కొల్ల గొడుతోంది. వ‌ర‌ల్డ్ లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన క్రీడా లీగ్ ల‌లో

ఒక‌టిగా నిలిచింది ఐపీఎల్. వ్యూయ‌ర్ షిప్ కార‌ణంగా ప్ర‌ధాన స్పోర్ట్స్ లీగ్ ల‌లో ర్యాంక్ లు పెంచింది.

ప్ర‌తి ఏటా 2-3 నెల‌ల మ‌ధ్య సాగుతుంది. మార్చి నుంచి మే వ‌ర‌కు సాగుతుంది. ఐపీఎల్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆట‌గాళ్ల‌కు, టీంల ప్రైజ్ మ‌నీ పెరుగుతూ వ‌చ్చింది.

2008లో ఇచ్చిన ప్రైజ్(IPL 2022 Cash Prize)  మ‌నీకి 2022 వ‌ర‌కు వ‌చ్చిన ప్రైజ్ మ‌నీ కి చాలా తేడా ఉంది. ఈసారి ఐపీఎల్ లో ఎంత వ‌ర‌కు

వ‌స్తుంద‌నేది చూస్తే ఇలా ఉన్నాయి. విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంది.

ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు రూ. 13 కోట్ల రూపాయ‌లు ల‌భిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన జ‌ట్టు ( క్వాలిఫ‌యిర్ 2లో ఓడి పోయిన జ‌ట్టు )కు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్టుకు రూ. 6.5 కోట్లు ద‌క్కుతాయి.

ఇవి కాకుండా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో ఆరెంజ్ క్యాప్ అవార్డు, ప‌ర్పుల్ క్యాప్ త‌దిత‌ర అవార్డులు అనేకం ఉన్నాయి. సూప‌ర్ స్ట్రైక‌ర్ ఆఫ్ ది సీజ‌న్ అవార్డు విజేత‌ల‌కు ఒక్కొక్క‌రికి రూ. 15 లక్ష‌ల చొప్పున అందుతాయి.

ఎమ‌ర్జింగ్ (ఉద్భ‌విస్తున్న‌) అవార్డు విజేతకు రూ. 20 ల‌క్ష‌లు(IPL 2022 Cash Prize) ఇస్తారు. ఇవే కాకుండా క్రాక్ ఇట్ సిక్స్ ఆఫ్ ది సీజ‌న్ అవార్డు,

ప‌వ‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సీజ‌న్ అవార్డు, మోస్ట్ విలువైన ప్లేయ‌ర్, గేమ్ ఛేంజ‌ర్ ఆఫ్ ది సీజ‌న్ అవార్డు కూడా ఇస్తారు.

ఎక్కువ సిక్స్ లు సాధించిన ప్లేయ‌ర్ కు రూ. 12 ల‌క్ష‌లు, అత్యంత విలువైన ఆట‌గాడి అవార్డు కింద రూ. 12 ల‌క్ష‌లు ఇస్తారు.

ఇక ఐపీఎల్ టోర్నీ ప‌రంగా స్టార్టింగ్ నుంచి నేటి దాకా ప్రైజ్ మ‌నీ ఎంత ఇచ్చారంటే 2008లో రూ. 4. 8 కోట్లు. 2009లో రూ. 6 కోట్లు, రూ. 2010లో రూ. 8 కోట్లు, 2011లో రూ. 10 కోట్లు అంద‌జేశారు ప్రైజ్ మ‌నీ కింద‌.

ఇక 2012లో రూ. 10 కోట్లు, 2013లో రూ. 10 కోట్లు, 2014లో రూ. 15 కోట్లు, 2015లో రూ. 15 కోట్లు విజేత‌కు ద‌క్కాయి. 2016లో రూ. 20 కోట్లు, 2017లో రూ. 15 కోట్లు , 2018లో రూ. 20 కోట్లు,

2019లో రూ. 20 కోట్లు , 2020లో రూ. 10 కోట్లు, రూ. 2021లో రూ. 20 కోట్లు ద‌క్కాయి ఐపీఎల్ విజేత‌కు.  ఈసారి జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో జ‌గ‌జ్జేత‌గా నిలిచే జ‌ట్టుకు రూ. 20 కోట్లు ప్రైజ్ మ‌నీ ద‌క్క‌నుంది.

ర‌న్న‌ర్ అప్ కు రూ. 13 కోట్లు, మూడో ప్లేస్ లో నిలిచిన జ‌ట్టు కు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్టుకు రూ. 6.5 కోట్లు దక్క‌నున్నాయి.

Also Read : కోట్లాది క‌ళ్ల‌న్నీ మోదీ స్టేడియం పైనే

Leave A Reply

Your Email Id will not be published!